ఆండ్రాయిడ్ యూజర్లు అమెజాన్ షాపింగ్ యాప్‌లో మాత్రమే అమెజాన్ మినీటీవీ సర్వీస్ ప్రయోజనాలను పొందగలరు. ప్రస్తుతం, అమెజాన్ మినీటీవీ ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఉచితంగా అందిస్తుంది అయితే భవిష్యత్తులో పేమెంట్ ఆప్షన్ ఉంటుందా లేదా అనే దానిపై కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
undefined
అమెజాన్ మినీటివిలో ఆశిష్ చంచలాని, ప్రజక్త కోలి, సెజల్ కుమార్, మాల్వికా సిట్లాని వంటి యూట్యూబ్ క్రియేటర్స్ కంటెంట్ ని కూడా మీరు చూడవచ్చు. ఫ్లిప్‌కార్ట్ 2019లో ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్ వీడియోను కూడా ప్రవేశపెట్టింది.
undefined
అమెజాన్ ప్రైమ్ వీడియో కంటే అమెజాన్ మినీటీవీ చాలా భిన్నంగా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో అనేది వీడియోలు లేదా షోలు చూడటానికి పేమెంట్ చెల్లించాల్సిన యాప్. అమెజాన్ సబ్ స్క్రిప్షన్ మూడు నెలలకు రూ.329, ఒక సంవత్సరానికి చార్జ్ రూ.999. అమెజాన్ మినీటీవీ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం అందుబారులో ఉంది, అయితే త్వరలో ఐఓఎస్ వినియోగదారులకు పరిచయం చేయబడుతుందని కంపెనీ తెలిపింది.
undefined
అమెజాన్ మినీటీవీలో టీవీఎఫ్, పాకెట్ ఏసెస్ వంటి ఛానెల్స్ ఉన్నాయి, ఇవి ఇప్పటికే యూట్యూబ్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. మీరు మినీటివిలో ఆహారం అండ్ ట్రెజర్ కోసం కబిటా కిచెన్, కుక్ విత్ నిషా, గాబుల్ వీడియోలను చూడవచ్చు. అమెజాన్ మినీటీవీలో టీవీ షోల నుండి సినిమాలు, వెబ్ సిరీస్ వరకు 5,00 టైటిల్స్ ఉన్నాయి.
undefined