బ్రష్ నుండి రోబో వరకు.. ప్రపంచాన్ని షాక్ కి గురి చేసిన 5 గాడ్జెట్‌లు ఇవే..

First Published | Jan 7, 2022, 11:44 AM IST

ప్రపంచంలోనే అతిపెద్ద కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2022) నేడు అంటే జనవరి 7న ముగియనుంది. అయితే సి‌ఈ‌ఎస్ ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం సి‌ఈ‌ఎస్ 2022 జనవరి 5 నుండి 7 వరకు లాస్ వెగాస్‌లో నిర్వహించారు. 

ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ పెద్ద టెక్ షోలో ప్రపంచంలోని ఎన్నో ప్రత్యేకమైన ఉత్పత్తులు ఆవిష్కరించారు. ఒక భారతీయ కంపెనీ సి‌ఈ‌ఎస్ లో పాల్గొనడం ఇదే తొలిసారి. భారతీయ కంపెనీ బ్లూసెమీ ( bluesemi) మొదటి ఉత్పత్తి EYVAను సి‌ఈ‌ఎస్ లో విడుదల చేసింది. EYVA అనేది నాన్-ఇన్వాసివ్ కన్స్యూమర్ హెల్త్ టెక్ గాడ్జెట్, ఇది కేవలం 60 సెకన్లలో బ్లడ్ ప్రేజర్ (BP)నుండి షుగర్ ఇంకా ఈ‌సి‌జి వరకు ప్రతిదీ చెక్ చేయగలదు. అంతేకాకుండా 10 సెకన్లలో ఆహారాన్ని అందించే రోబోట్‌ నుండి  దంతాలను శుభ్రపరిచే గాడ్జెట్ వరకు ఉన్నాయి. ఈ ఫుడ్ డెలివరీ రోబోట్‌ను ఎల్‌జి పరిచయం చేసింది, దీనికి 3D కెమెరా సెన్సార్‌ ఉంది. సి‌ఈ‌ఎస్ 2022లో ప్రారంభించిన కొన్ని ప్రత్యేక ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం...

ఎల్‌జి సి‌ఎల్‌ఓఐ (CLOi) సర్వ్‌బాట్
ఎల్‌జి  సి‌ఎల్‌ఓఐ సర్వ్‌బాట్ నాలుగు చక్రాలు కలిగిన ఏ‌ఐ(artificial intelligence) రోబోట్. ఇందులో మూడు సెల్ఫ్ ఉన్నాయి, అందులో వస్తువులు ఉంచవచ్చు. దీనికి సెల్ఫ్ డ్రైవింగ్ సౌకర్యం కూడా ఉంది. ఎల్‌జీకి చెందిన ఈ రోబో ఒకేసారి 17 కిలోల లగేజీని తీసుకెళ్లగలదు. దీనిని హోటళ్లు, ఆసుపత్రులు, రిటైల్ అవుట్‌లెట్లలో ఉపయోగించబడుతుంది.
 

Latest Videos


ప్రింటర్
ఈ టెక్ షోలో ప్రజల దృష్టిని ఆకర్షించిన మరో ప్రత్యేక ఉత్పత్తి ప్రింకర్. ప్రింకర్ అనేది తాత్కాలిక టాటూ(temporary tattoo) డివైజ్, ఇది కేవలం కొన్ని సెకన్లలో మీ శరీరంలోని ఏ భాగంపైనైన టాటూలను వేయగలదు. సింపుల్ గా చెప్పాలంటే ప్రింకర్ ఒక చిన్న పోర్టబుల్ టాటూ డివైజ్. ప్రింకర్ మీ ఫోన్‌లో ఉన్న ఏదైనా ఫోటోను మీ శరీరంపై ప్రింట్ చేయగలదు. దీని ధర 200 డాలర్లు అంటే దాదాపు రూ.14,876.
 

వై-బ్రష్
ఎలక్ట్రిక్ బ్రష్‌లు ఇప్పటికే మార్కెట్‌లోఅందుబాటులో ఉన్నాయి, అయితే ఈసారి సి‌ఈ‌ఎస్ లో మరో ఎలక్ట్రిక్ బ్రష్ వై-బ్రష్ పరిచయం చేసింది, ఇది కేవలం 10 సెకన్లలో మీ దంతాలను గొప్పగా శుభ్రపరచగలదు. ఈ బ్రష్ 45 డిగ్రీల కోణం నుండి దంతాలను శుభ్రపరుస్తుంది.
 

శామ్సంగ్ ఫ్రీస్టైల్
శామ్సంగ్ (Samsung) సి‌ఈ‌ఎస్ 2022లో ఒక పోర్టబుల్ డివైజ్ పరిచయం చేసింది, దీనికి శామ్సంగ్ ఫ్రీస్టైల్ అని పేరు పెట్టారు. ఇది  ప్రొజెక్ట్ నుండి స్మార్ట్ స్పీకర్ ఇంకా యాంబియంట్ లైటింగ్ డివైజ్ వరకు  పని చేస్తుంది. శామ్సంగ్ ఫ్రీస్టైల్ బరువు 830 గ్రాములు. దీని సహాయంతో మీరు ఏ స్థలాన్ని అయినా సినిమా స్క్రీన్‌గా మార్చవచ్చు. ఈ శాంసంగ్ ప్రొజెక్టర్ 180 డిగ్రీల వరకు తిరిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
 

టి‌సి‌ఎల్  నెక్స్ట్ వేర్ (NXTWear)ఎయిర్  
ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్‌ విస్తరిస్తూ సి‌ఈ‌ఎస్ లో టి‌సి‌ఎల్ ఒక కొత్త స్మార్ట్ గ్లాస్ నెక్స్ట్ వేర్ ( NXTWear) ఎయిర్‌ను పరిచయం చేసింది, ఇది ఎక్స్టీరియర్ డిస్ ప్లే ఉంది. ఈ గ్లాస్‌తో మీకు 140-అంగుళాల టీవీలో ఎలాంటి అనుభవం ఉంటుందో అదే అనుభవం ఉంటుందని పేర్కొన్నారు. ఈ గ్లాస్‌ని ఏ స్క్రీన్ నుండి అయినా టైప్-సి పోర్ట్‌తో కనెక్ట్ చేయవచ్చు.

click me!