ఐక్యూ 9 6.78-అంగుళాల ఫుల్ HD ప్లస్ Samsung E5 OLED డిస్‌ప్లేతో మరోవైపు ఐక్యూ 9 ప్రొ 6.78-అంగుళాల కర్వ్డ్ క్వాడ్ HD ప్లస్ E5 OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత OriginOS Ocean రెండు ఫోన్‌లలో ఇచ్చారు.
ఐక్యూ 9, ఐక్యూ 9 ప్రొ ధర
ఐక్యూ 9 ప్రారంభ ధర 3,999 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ. 47,000. ఈ ధర 8 జిబి ర్యామ్, 256జిబి స్టోరేజ్ వేరియంట్ లభిస్తుంది. ఈ ఫోన్ ని 12జిబి ర్యామ్ ఇంకా 512 జిబి స్టోరేజ్‌లో కూడా పరిచయం చేశారు, దీని ధర 4,799 యువాన్లు అంటే దాదాపు రూ. 56,240. ఐక్యూ 9 ప్రొ 8జిబి ర్యామ్ తో 256జిబి స్టోరేజ్ ధర 4,999 యువాన్లు అంటే దాదాపు రూ. 58,600. ఈ ఫోన్ 12 జిబి ర్యామ్ తో 512 జిబి స్టోరేజ్ ధర 5,999 యువాన్లు అంటే దాదాపు రూ. 70,300.
ఐక్యూ 9 స్పెసిఫికేషన్‌లు
ఈ స్మార్ట్ ఫోన్ 1080x2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల పూర్తి HD+ OLED డిస్‌ప్లే లభిస్తుంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 120Hz. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఐక్యూ 9 స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్‌తో 12జిబి వరకు ర్యామ్, 12జిబి వరకు స్టోరేజ్ ఆప్షన్ ఉంది.
ఐక్యూ 9లో మూడు వెనుక కెమెరాలు ఉన్నాయి, దీని ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్‌తో Samsung GN5 1/1.57 సెన్సార్ ఇచ్చారు. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. రెండవ లెన్స్ 13 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్, మూడవ లెన్స్ 12 మెగాపిక్సెల్స్ పోర్ట్రెయిట్ సెన్సార్. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. ఇంకా 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4700mAh బ్యాటరీ ఉంది
ఐక్యూ 9 ప్రొ స్పెసిఫికేషన్‌లు
ఈ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల క్వాడ్-HD+ (3,200x1,440 పిక్సెల్‌లు) Samsung E5 డిస్‌ప్లే లభిస్తుంది. ఐక్యూ 9 ప్రొ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్‌తో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ అందిస్తుంది.
ఐక్యూ 9 ప్రోలో కూడా మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్స్, రెండవ లెన్స్ 50 మెగాపిక్సెల్స్ అండ్ మూడవ లెన్స్ 16 మెగాపిక్సెల్స్. ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 4700mAh బ్యాటరీ లభిస్తుంది.