వినియోగదారులు సేవ్ చేసిన డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ను పేటీఎం యాప్‌లో యాక్టివేట్ చేసి ‘ట్యాప్ టు పే’ కోసం ఎనేబుల్ చేయవచ్చు.
ఇది 16-అంకెల కార్డ్ నంబర్‌ను డిజిటల్ ఐడెంటిఫైయర్‌గా మారుస్తుంది, అంతేకాకుండా కార్డ్ చెల్లింపులను మరింత సురక్షితం చేయడం ద్వారా మొత్తం లావాదేవీల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకా రిటైల్ స్టోర్లలో వేగవంతమైన చెల్లింపు లావాదేవీలను సులభతరం చేస్తుంది. పేటీఎం PoS డివైజెస్ తో పాటు ఇతర బ్యాంకుల PoS మెషీన్‌లపై చెల్లింపులకు వర్తిస్తుంది
వినియోగదారులు ఇంకా వ్యాపారుల కోసం భారతదేశపు ప్రముఖ డిజిటల్ ఎకోసిస్టమ్ పేటీఎం ఈరోజు ‘ట్యాప్ టు పే’ని ప్రారంభించినట్లు ప్రకటించింది, ఇది వినియోగదారులు వారి పేటీఎం రిజిస్టర్డ్ కార్డ్ ద్వారా కేవలం PoS మెషీన్‌లో వారి ఫోన్‌ను నొక్కడం ద్వారా తక్షణ చెల్లింపులను చేయడానికి వీలు కల్పిస్తుంది. ఫోన్ లాక్ చేయబడినా లేదా మొబైల్ డేటా లేదా ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా ఇది సాధ్యమవుతుంది. పేటీఎం ఆల్ ఇన్ వన్ PoS డివైజెస్ అలాగే ఇతర బ్యాంకుల PoS మెషీన్‌ల ద్వారా చెల్లించే ఆండ్రాయిడ్ ఇంకా iOS వినియోగదారులకు పేటీఎం ట్యాప్ టు పే సర్వీస్ అందుబాటులో ఉంది.
తాజా ట్యాప్ టు పే సర్వీసుతో సెలెక్ట్ చేసిన కార్డ్‌లోని 16-అంకెల ప్రాథమిక ఖాతా సంఖ్య (PAN)ను సురక్షిత లావాదేవీ కోడ్ లేదా “డిజిటల్ ఐడెంటిఫైయర్”గా మార్చడానికి పేటీఎం స్ట్రాంగ్ టెక్నాలజిని ఉపయోగిస్తుంది. ఈ డిజిటల్ ఐడెంటిఫైయర్ వినియోగదారుల కార్డ్ వివరాలు వినియోగదారుల వద్ద మాత్రమే ఉండేలా చూస్తుంది ఇంకా ఏ థర్డ్ పార్టీ పేమెంట్ ప్రాసెసర్‌తోనూ భాగస్వామ్యం చేయదు. ఒక వినియోగదారుడు రిటైల్ అవుట్‌లెట్‌ను సందర్శించినప్పుడు వారు లావాదేవీల ద్వారా వారి కార్డ్ వివరాలను పంచుకోనవసరం లేకుండా కేవలం PoS డివైజెస్ లో నొక్కి, చెల్లించవచ్చు.
తాజా ఫీచర్‌తో, NFC (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్)కు మద్దతు ఇచ్చే కార్డ్ మెషీన్‌లను కలిగి ఉన్న అన్ని రిటైల్ అవుట్‌లెట్‌లలో చెల్లింపులు చేయవచ్చు. కార్డ్‌ల లావాదేవీ చరిత్రపై ఒక విభాగాన్ని అందించే పేటీఎం యాప్‌లోని డెడికేటెడ్ డ్యాష్‌బోర్డ్ ద్వారా కార్డ్‌లను నిర్వహించవచ్చు మరియు ఏ క్షణంలోనైనా కొన్ని సాధారణ దశల్లో ప్రాథమిక టోకనైజ్డ్ కార్డ్‌ని కూడా మార్చవచ్చు. డ్యాష్‌బోర్డ్ వినియోగదారుని అవసరమైనప్పుడు కార్డ్‌ని మార్చడానికి లేదా డీ-టోకనైజ్ చేయడానికి కూడా అనుమతిస్తుంది.
తాజా ఫీచర్‌తో, NFC (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్)కు మద్దతు ఇచ్చే కార్డ్ మెషీన్‌లను కలిగి ఉన్న అన్ని రిటైల్ అవుట్‌లెట్‌లలో చెల్లింపులు చేయవచ్చు. కార్డ్‌ల లావాదేవీ చరిత్రపై ఒక విభాగాన్ని అందించే పేటీఎం యాప్‌లోని డెడికేటెడ్ డ్యాష్‌బోర్డ్ ద్వారా కార్డ్‌లను నిర్వహించవచ్చు మరియు ఏ క్షణంలోనైనా కొన్ని సాధారణ దశల్లో ప్రాథమిక టోకనైజ్డ్ కార్డ్‌ని కూడా మార్చవచ్చు. డ్యాష్‌బోర్డ్ వినియోగదారుని అవసరమైనప్పుడు కార్డ్‌ని మార్చడానికి లేదా డీ-టోకనైజ్ చేయడానికి కూడా అనుమతిస్తుంది.
పేటీఎం ప్రతినిధి మాట్లాడుతూ“డేటా లిమిట్స్ అడ్డుపడనప్పుడు మాత్రమే ఆర్థిక సేవల ట్రు డిజిటలైజేషన్ జరుగుతుంది. ట్యాప్ టు పేతో మేము ఇప్పుడు మా వినియోగదారులకు మొబైల్ డేటాతో లేదా ఇంటర్నెట్ లేకుండా కూడా అన్ని డిజిటల్ లావాదేవీలను నిర్వహించడానికి వీలు కల్పిస్తున్నాము. ఈ సర్వీస్ పేటీఎం ఆల్-ఇన్-వన్ PoS ద్వారా ఇంకా మా వినియోగదారులకు విస్తృత శ్రేణి ఎంపికలను అందించడానికి ప్రధాన బ్యాంకులు ఇంకా కార్డ్ నెట్‌వర్క్‌ల ద్వారా సపోర్ట్ అందిస్తుంది.
వినియోగదారులు పేటీఎం యాప్‌లో ‘టాప్ టు పే’ ఆప్షన్ ఎంచుకోవచ్చు ఇంకా కింద ఉన్న దశలను అనుసరించడం ద్వారా వారి కార్డ్‌లను ఆక్టివేట్ చేయవచ్చు:
మొదట కార్డ్ లిస్ట్ నుండి అర్హత కలిగిన సేవ్ చేసిన కార్డ్‌ని ఎంచుకోండి లేదా హోమ్ స్క్రీన్‌పై పేమెంట్ ట్యాప్ చేసి“యాడ్ న్యూ కార్డ్ ”పై క్లిక్ చేయండి
తరువాత స్క్రీన్‌పై అవసరమైన కార్డ్ వివరాలను అందించండి.
ట్యాప్ టు పే కోసం జారీ చేసే సర్వీసు నిబంధనలను ఆమోదించండి
కార్డ్‌తో రిజిస్టర్ చేసిన మీ మొబైల్ నంబర్ (లేదా మెయిల్ ఐడి)కి వచ్చిన OTPని అందించండి.
ఇప్పుడు ట్యాప్ టు పే హోమ్ స్క్రీన్ పైభాగంలో యాక్టివేట్ చేసిన కార్డ్‌ని చూడగలరు.
పేటీఎం గురించి:
పేటీఎం అనేది వినియోగదారులకు ఇంకా వ్యాపారులకు భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ ఎకోసిస్టమ్ గా అవతరించింది ఇంకా 31 మార్చి 2021 నాటికి 333 మిలియన్ల వినియోగదారులకు అలాగే 21 మిలియన్లకు పైగా వ్యాపారులకు పేమెంట్ సేవలు, బిజినెస్ అండ్ క్లౌడ్ సేవలు, ఆర్థిక సేవలను అందిస్తుంది. వినియోగదారుల సంఖ్య, వ్యాపారుల సంఖ్య, వినియోగదారుల నుండి మర్చంట్ లావాదేవీలు ఇంకా ఆదాయాల ఆధారంగా 31 మార్చి 2021 నాటికి అలాగే GMV 4,033 బిలియన్ FY2021 తో పేటీఎం భారతదేశంలో అతిపెద్ద చెల్లింపుల ప్లాట్‌ఫామ్ గా అవతరించింది. One 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అనేది మొత్తం లావాదేవీల ఆధారంగా FY2021 కోసం భారతదేశంలో అతిపెద్ద పేమెంట్ గేట్‌వే అగ్రిగేటర్, చెల్లింపు డివైజెస్ విస్తృత ఎకోసిస్టమ్. కంపెనీ ఋణ వ్యాపారం, వ్యక్తిగత ఋణాలు, మర్చంట్ ఋణాలు, అలాగే బై నవ్ పే లెటర్ అనే పేటీఎం పోస్ట్‌పెయిడ్ అందుబాటులో ఉంటాయి. పేటీఎం ఆర్థిక సంస్థ భాగస్వాములు Q4FY21లో 1.4 మిలియన్ రుణాలను పంపిణీ చేశారు.
సోర్స్: రెడ్‌సీర్ తయారు చేసిన "ద డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ పేమెంట్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్ ఇండియా” 15 జూలై 2021" అనే శీర్షిక గల నివేదిక నుండి తీసుకోబడింది.