వాట్సప్ ప్రొఫైల్ ఫోటో కనిపించడం లేదా? కొత్త అప్‌డేట్‌ ఇదిగో !

First Published | Apr 15, 2024, 7:30 PM IST

కొన్నిసార్లు మీరు WhatsAppలో కొన్ని కాంటాక్ట్స్  ప్రొఫైల్ ఫోటోని చూడలేకపోవచ్చు. ఎందుకు అలా అని ఆలోచించారా ? మీరు WhatsApp DPని ఎందుకు చూడలేకపోతున్నారో  ఈ కారణలు తెలుసుకోండి... 
 

ఒక వ్యక్తి తన ప్రొఫైల్ ఫోటోని ఎవరూ చూడకుండా సెట్ చేయబడవచ్చు. అంటే ఆ వ్యక్తి ప్రొఫైల్ పిక్చర్ మీతో సహా అందరికి కనిపించకుండా హైడ్ చేయవచ్చు.
 

మీ మొబైల్ నంబర్ అతని మొబైల్‌లో సేవ్  చేయకపోతే అతను ప్రొఫైల్ ఫోటోని మీరు చూడలేడు. అతను సేవ్ చేసిన నంబర్‌లకు మాత్రమే తన ప్రొఫైల్ ఫోటో  కనిపించేలా సెట్ చేసుకోవచ్చు.


 ఒక వ్యక్తి ఫోన్ నుండి మీ మొబైల్ నంబర్‌ను డిలేట్ చేసి ఉండవచ్చు. మీరు ఇంతకుముందు ప్రొఫైల్ ఫోటో  చూడగలిగినప్పటికీ, నంబర్‌ను డిలేట్ చేసిన తర్వాత   ప్రొఫైల్ ఫోటో కనిపించదు.
 

ఆ వ్యక్తి తన ప్రొఫైల్ ఫోటోని  అందరు చూడగలిగేలా సెట్  చేసి  ఉండవచ్చు. అంటే అతని ఫోన్ నుండి మీ నంబర్‌ని డిలేట్ చేసిన  ప్రొఫైల్ ఫోటోని  నంబర్ ద్వారా చూడవచ్చు. 
 

 ఆ వ్యక్తి మీ నంబర్‌ని బ్లాక్ చేసి ఉండవచ్చు. మీరు పంపిన తప్పుడు మెసేజ్  వల్ల లేదా మీరు అతనితో గొడవ పడిన అతను మిమ్మల్ని బ్లాక్ చేసే  అవకాశం ఉంది.
 

ప్రొఫైల్ ఫోటో  ఉండకపోవచ్చు లేదా  ప్రొఫైల్ ఫోటో  తీసేసి ఉండవచ్చు. అంటే సెట్టింగ్స్‌లో ఒక వ్యక్తికి మాత్రమే ప్రొఫైల్ ఫోటో  కనిపించకుండా చేసేలా  ఎలాంటి కండిషన్స్  ఉండవు. 
 

అతను తన వాట్సాప్ అకౌంట్  డిలేట్ చేసి ఉండవచ్చు. మీరు WhatsAppలో ఒకరి ప్రొఫైల్ ఫోటోని చూడలేకపోతే, వారు వాట్సాప్ అకౌంట్  పూర్తిగా డీ-యాక్టివేట్ చేసి ఉండవచ్చు.
 

Latest Videos

click me!