ఇంటర్నెట్ షట్‌డౌన్ 2021: ప్రపంచానికి వేల కోట్ల నష్టం, ఇండియాలో ఎన్ని గంటలపాటు నిలిచిపోయిందంటే..?

First Published | Jan 13, 2022, 8:12 PM IST

ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒకోసారి ఇంటర్నెట్‌ (internet)అంతరాయం ఏర్పడుతుంటుంది.  కొన్నిసార్లు భద్రతా కారణాల వల్ల ప్రభుత్వం ఇంటర్నెట్‌ను నిలిపివేయగా, మరికొన్నిసార్లు కొన్ని టెక్నికల్ సమస్య కారణంగా ఇంటర్నెట్ షట్‌డౌన్ ()internet shutdownచేయబడుతుంది. 

ప్రతి సంవత్సరం చివరిలో ఎప్పటిలాగానే  ఇంటర్నెట్ షట్‌డౌన్‌ ఆఫ్ ఇయర్ నివేదికలు వెల్లడవుతాయి. తాజాగా 2021 నివేదిక కూడా బయటికి వచ్చింది. 2020 కంటే 2021లో 36 శాతం ఎక్కువగా ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు జరిగాయి. 2021 సంవత్సరంలో ప్రపంచం మొత్తం మీద 30వేల గంటల పాటు ఇంటర్నెట్ ఆపివేయబడింది, ఈ కారణంగా 5.45 బిలియన్లు అంటే దాదాపు 40,300 కోట్ల రూపాయల నష్టం జరిగింది. 

భారతదేశంలో 1,157 గంటల పాటు
ఇంటర్నెట్ షట్‌డౌన్ కారణంగా అత్యధికంగా నష్టపోయిన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. భారతదేశంలో, 2021 సంవత్సరంలో 1,157 గంటల పాటు ఇంటర్నెట్ మూసివేయబడింది, దీని కారణంగా  582.8 మిలియన్లు అంటే దాదాపు రూ. 4,300 కోట్ల నష్టం జరిగింది. వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) ఆధారిత వెబ్‌సైట్ Top10VPN నివేదిక నుండి ఈ సమాచారం తీసుకోబడింది. భారతదేశంలో ఇంటర్నెట్ షట్‌డౌన్ 59 మిలియన్ల మందిని ప్రభావితం చేసింది. రైతుల ఉద్యమం సందర్భంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో చాలా కాలంపాటు ఇంటర్నెట్ షట్‌డౌన్ జరిగింది.
 

Latest Videos


ఇంటర్నెట్ షట్ డౌన్‌లో మయన్మార్ టాప్
2021 సంవత్సరంలో ఇంటర్నెట్ షట్‌డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 48 కోట్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ఏడాది ప్రాతిపదికన 80 శాతం పెరుగుదల కనిపించింది. 2021లో 21 దేశాలలో 50  మేజర్ ఇంటర్నెట్ అంతరాయాలు సంభవించాయి, వీటిలో 75 శాతం ఇంటర్నెట్ అంతరాయాలు ప్రభుత్వాల వల్ల సంభవించాయి.

ఇంటర్నెట్‌ను నిలిపివేయడంలో మయన్మార్‌ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 2021లో ఇంటర్నెట్ ఆపివేయడం వల్ల 2.8 బిలియన్ల డాలర్లు అంటే దాదాపు రూ. 20,700 కోట్ల నష్టం జరిగింది అంతేకాకుండా 22 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. షట్‌డౌన్  తర్వాత నైజీరియా రెండవ స్థానంలో ఉంది, ఇంటర్నెట్ షట్‌డౌన్ కారణంగా ఇక్కడ 10.4 కోట్ల మంది ప్రభావితమయ్యారు అలాగే సుమారు రూ. 11,100 కోట్ల నష్టం జరిగింది.

click me!