వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది.. అవి నేరుగా జనావాసాల్లోకి వస్తుంటాయి. ఇలాంటి టైంలో పాముల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం. మీ ఫోన్ లో ఓ యాప్ ఉంటే పాముల నుంచి రక్షణ పొందవచ్చు... అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.
వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతుంటాయి... దీంతో పాములు ఉండే పుట్టలు, కన్నాలు నీటితో నిండిపోతాయి. అందుకే పాములు సురక్షితమైన, వెచ్చని ప్రదేశాల కోసం బయటకు వస్తాయి. ఈ కారణంగానే వర్షాకాలంలో పాములు జనావాసాల్లోకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇక వర్షాల కారణంగా ఇళ్లచుట్టూ గడ్డిపెరుగుతుంది... కాబట్టి తమ నివాసాన్ని కోల్పోయిన పాములు ఇందులోకి చేరతాయి... అక్కడి నుండి కిటికీలు, గోడలకు ఉండే రంధ్రాల ద్వారా ఇళ్లలోకి చేరుతుంటాయి. కాబట్టి వర్షకాలంలో పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి.
పట్టణాలతో పోలిస్తే పల్లెటూర్లలో వర్షాకాలంలో పాముల బెడద మరీ ఎక్కువ. ఇంటి బయట పెట్టిన షూలలో పాములు వెచ్చదనం కోసం దూరి ఉంటాయి. షూ లోపల ఉన్న పాము కరిచి చనిపోయిన ఘటనలు మనం చాలానే చూశాం, చదివాం. అందుకే వర్షాకాలంలో పాముల నుంచి రక్షణ పొందడానికి కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
25
పాముల నుండి కాపాడే మొబైల్ యాప్
ఓ మైబైల్ యాప్ మిమ్మల్ని పాముల నుంచి కాపాడుతుంది... వినడానికి ఆశ్చర్యంగా ఉందా? అయినా ఇది నిజం. మీ ఇంట్లోకి పాములు రాకుండా హెచ్చరించే టెక్నాలజీ వచ్చేసింది. పాముల గురించి హెచ్చరించడానికే ప్రత్యేకంగా తయారు చేసిన యాప్ అందుబాటులో ఉంది. పాముల బెడద ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే వారికి ఈ టెక్నాలజీ ఒక వరం లాంటిది. ప్రజలు పాముల గురించి సమాచారం పొందడానికి, ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించడానికి, అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేయడానికి ఈ యాప్స్ ఉపయోగపడతాయి. మరి మిమ్మల్ని పాముల నుంచి ఏ యాప్ కాపాడుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
35
ఏమిటీ బిగ్ 4 మ్యాపర్ యాప్.. ఎలా పనిచేస్తుంది?
ఈ బిగ్ 4 మ్యాపర్ అనేది పాముల సమాచారం ఇచ్చే అప్లికేషన్లలో చాలా పాపులర్. దీని ప్రధాన ఫీచర్ మ్యాప్ ఆధారిత సిస్టమ్. యూజర్లు తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో పాములు ఎక్కడ కనిపించాయో, ఏ ప్రాంతాలు ఎక్కువ ప్రమాదకరమో దీని ద్వారా చూడొచ్చు. ఇది ప్రజలు అప్రమత్తంగా ఉండటానికి, అలాంటి ప్రాంతాలకు దూరంగా ఉండటానికి సహాయపడుతుంది.
పొలాల్లో పనిచేసే రైతులకు, అడవుల దగ్గర నివసించేవారికి, రాత్రిపూట బయటకు వెళ్లేవారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది. ఈ యాప్ జీపీఎస్ ఆధారిత లొకేషన్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. ఇది ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించడాన్ని సులభం చేస్తుంది. ఇండియన్ స్నేక్ బైట్ ఇనిషియేటివ్' (Indian Snake Bite Initiative), 'ఇండియన్ స్నేక్స్' (IndianSnakes) సంస్థలు ఈ యాప్ ను అభివృద్ధి చేశాయి.
చాలా మంది అన్ని పాములూ విషపూరితమైనవే అని నమ్ముతారు. కానీ పాములలో విషసర్పాలు ఉన్నాయి, విషం లేనివి కూడా ఉన్నాయి... చాలామంది వాటిని గుర్తించడంలో విఫలమవుతారు. ఈ బిగ్ 4 మ్యాపర్ యాప్ పాముల గురించి సరైన సమాచారం ఇవ్వడమే కాకుండా, ఏది విషపూరితమైనదో, ఏది కాదో వివరిస్తుంది. ఈ యాప్‌లో వివిధ రకాల పాముల ఫోటోలు, వాటి వివరాలు ఉంటాయి. ఇది పాములను సులభంగా గుర్తించడానికి సహాయపడుతుంది.
బిగ్ 4 మ్యాపర్ యాప్ ఎక్కువగా భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన నాలుగు విషపూరిత పాములపై దృష్టి పెడుతుంది. వీటిలో నాగుపాము (Cobra), కట్లపాము (Common Krait), రక్తపింజర (Russell's Viper), గొలుసు పింజర (Saw-scaled Viper) ఉన్నాయి. దేశంలో అత్యధిక పాముకాటు మరణాలకు ఈ జాతులే కారణం.
55
పాము కరిస్తే వెంటనే ఏ చేయాలో తెలుసుకొండి.
ఒకవేళ పాము కరిస్తే, ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా ఈ బిగ్ 4 మ్యాపర్ యాప్ వెంటనే సలహా ఇస్తుంది. అలాంటి సమయాల్లో ప్రజలు వెంటనే వైద్య సహాయం పొందడానికి, సరైన ప్రథమ చికిత్స పొంది ప్రాణాలు కాపాడుకోడానికి ఈ యాప్ సహాయపడుతుంది.
బిగ్ 4 మ్యాపర్ వంటి యాప్‌లతో పాటు పలు రాష్ట్రాలు పాములు కనిపించిన సమాచారాన్ని నేరుగా అధికారిక స్నేక్ రెస్క్యూ టీమ్‌లకు, అటవీ శాఖ సిబ్బందికి చేరవేసే వ్యవస్థలను కూడా అభివృద్ధి చేశాయి. ఇది పామును సురక్షితంగా పట్టుకుని, రక్షించడానికి వీలు కల్పిస్తుంది… ప్రాణాలు కాపాడుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.