
స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ముందుగా కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్, డిస్ప్లే క్వాలిటీ, సాఫ్ట్వేర్ ఫీచర్లు లాంటివి చూస్తాం కదా. అందుకే ప్రతి మొబైల్స్ తయారీ కంపెనీ సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి తెస్తుంటాయి. ఇలా 2026లో ఇండియాలో బడ్జెట్ ఫోన్ల నుంచి లక్షల రూపాయల ప్రీమియం మోడల్స్ వరకు చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఈ లిస్ట్‌లో బడ్జెట్ ధరలో మంచి బ్యాటరీ ఉన్న ఫోన్లు, గేమింగ్ స్మార్ట్ఫోన్లు, బెస్ట్ కెమెరా ఉన్న ఫ్లాగ్షిప్ మోడల్స్, ఫోల్డబుల్ ఫోన్లు.. ఇలా బెస్ట్ 9 ఫోన్లు ఏవో తెలుసుకుందాం.
తక్కువ ధరలో ఎక్కువసేపు వాడేందుకు ఒక మంచి స్మార్ట్‌ఫోన్ కావాలనుకునే వారికి మోటో జి37 పవర్ ఒక బెస్ట్ ఆప్షన్.
దీనిలో పెద్ద బ్యాటరీ, 5G సపోర్ట్, 120Hz డిస్ప్లే మెయిన్ ఫీచర్లు. అంతేకాకుండా గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్, MIL-STD-810H క్వాలిటీ సర్టిఫికేషన్ కూడా ఉన్నాయి.
మిడ్ రేంజ్ బడ్జెట్లో మంచి డిజైన్, బెస్ట్ డిస్ప్లే, పెద్ద బ్యాటరీ కోరుకునే వారికి ఈ మోడల్ పర్ఫెక్ట్ గా ఉంటుంది.
అలాగే దీంట్లో IP68/IP69 ప్రొటెక్షన్ కూడా ఉంది. ఎక్కువ సేపు వీడియోలు చూడటం, ఇంటర్నెట్ వాడటం లాంటి అవసరాలకు ఇది బాగా సెట్ అవుతుంది.
ఈ ఫోన్లో పవర్ఫుల్ ప్రాసెసర్, 144Hz డిస్ప్లే, పెద్ద బ్యాటరీ లాంటివి ఉన్నాయి. ఒకే ఫోన్లో అటు ఫొటోగ్రఫీకి, ఇటు గేమింగ్ కి రెండింటికీ వాడాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.
వన్‌ప్లస్ తీసుకొచ్చిన ఈ మోడల్లో ప్రధాన ఆకర్షణ దీని 9,000mAh బ్యాటరీనే. ఎక్కువసేపు ఫోన్ వాడేవారికి, గేమింగ్ ఇష్టపడేవారికి ఇది చాలా బాగుంటుంది.
వీటితో పాటు IP66, IP68, IP69, IP69K సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా ఉన్నాయి. ఆరేళ్ల పాటు సిస్టమ్ అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వన్‌ప్లస్ తెలిపింది.
గేమింగ్, పెర్ఫార్మెన్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారికి పోకో X8 ప్రో మ్యాక్స్ ఒక మంచి ఆప్షన్ గా నిలుస్తుంది.
పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, పవర్ఫుల్ ప్రాసెసర్ దీని మెయిన్ హైలైట్స్. ముఖ్యంగా ఎక్కువసేపు మొబైల్ గేమ్స్ ఆడేవారికి ఈ ఫోన్ బాగా సూట్ అవుతుంది.
కెమెరా, డిస్ప్లే, పెర్ఫార్మెన్స్ లలో బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వారి కోసం శాంసంగ్ తీసుకొచ్చిన ఫ్లాగ్షిప్ మోడల్ ఇది.
ఫొటోలను ఎడిట్ చేయడానికి, ఏఐ (AI) ఫీచర్లను ఉపయోగించడానికి దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంతేకాకుండా, లాంగ్ టర్మ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ దీనికి మరో ప్లస్ పాయింట్.
సాధారణ స్మార్ట్‌ఫోన్‌ను, చిన్న ట్యాబ్లెట్‌ను ఒకే డివైజ్‌లో వాడాలనుకునే వారికి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు మంచి ఆప్షన్. ఈ విభాగంలో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్8 బెస్ట్ మోడల్ గా ఉంది.
ఈ ఫోన్ తెరిచినప్పుడు పెద్ద డిస్ప్లే వస్తుంది కాబట్టి ఒకేసారి మల్టిపుల్ యాప్స్ వాడటానికి, వీడియోలు చూడటానికి, డాక్యుమెంట్స్ చదవడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది.
ఆపిల్ అభిమానులకి, వీడియో రికార్డింగ్ మీద ఆసక్తి ఉన్నవారికి ఈ ఐఫోన్ 18 ప్రో ఒక ప్రీమియం ఛాయిస్ గా ఉంటుంది.
ఇందులో అడ్వాన్స్డ్ కెమెరా ఫీచర్లు, 8x ఆప్టికల్ క్వాలిటీ జూమ్, 4K డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్, ఆపిల్ ఇంటెలిజెన్స్ లాంటివి ఉన్నాయి.
ఫొటోలు, వీడియోలు తీయడం అంటే పిచ్చి ఉన్న వాళ్ల కోసం వివో ప్రత్యేకంగా తీసుకొచ్చిన ప్రీమియం మోడల్ ఈ X300 అల్ట్రా.
200MP ZEISS గింబల్-గ్రేడ్ APO టెలిఫోటో కెమెరా, 4K 120fps డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ దీనిలో మెయిన్ ఫీచర్లు.
2026లో లాంచ్ అయిన ఈ స్మార్ట్ఫోన్లు ఒక్కొక్కటి ఒక్కో అవసరం కోసం డిజైన్ చేశారు. అందుకే కేవలం ధర మాత్రమే కాకుండా, మీ అవసరాలకు తగ్గ ఫీచర్లను కూడా పోల్చి చూసుకుని ఫోన్ కొనుక్కోవడం ముఖ్యం.
కొత్త ఫోన్ కొనేముందు ర్యామ్, స్టోరేజ్, కెమెరా, బ్యాటరీ, సాఫ్ట్వేర్ అప్డేట్స్, వారంటీ లాంటివి కంపేర్ చేసుకోండి. ఆన్లైన్ ధరకు, ఆఫ్‌లైన్ ధరకు తేడా ఉండే అవకాశం ఉంది కాబట్టి కొనేటప్పుడు ఒకసారి ధరలు క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది.