కొత్త డిస్‌ప్లే... హై-స్పీడ్ ప్రాసెసర్... అద్భుతమైన ఫీచర్స్ తో ఆపిల్ 9 సిరీస్ వాచ్..

First Published | Sep 13, 2023, 12:57 PM IST

ఆపిల్  వండర్లస్ట్ ఈవెంట్‌లో కొత్త ఆపిల్ వాచ్ సిరీస్ 9ని ఆవిష్కరించింది. ఆపిల్ వాచ్ సిరీస్ 9 కొత్త S9 ప్రాసెసర్‌తో వస్తుంది. ఆపిల్ కొత్త వాచ్ 8 సిరీస్  కంటే 60% వరకు వేగంగా పని చేయగలదని కంపెనీ పేర్కొంది.
 

ఆపిల్ 9 సిరీస్ వాచీలు స్టార్‌లైట్, మిడ్‌నైట్, సిల్వర్ ఇంకా రెడ్ కలర్స్‌లో 41mm  అండ్  45mm  సైజులలో అందుబాటులో ఉంటాయి. కేస్ కవర్లు పింక్ అల్యూమినియం, గోల్డ్, సిల్వర్  అండ్ గ్రాఫైట్ కలర్స్ లో వస్తున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, జపాన్, UAE, US, UK ఇంకా  40 కంటే ఎక్కువ ఇతర దేశాలు,  ప్రాంతాలలోని కస్టమర్‌లు Apple Watch Series 9 అండ్  Apple Watch SEని ఆర్డర్ చేయవచ్చు.
 

కొత్త ఆపిల్ వాచ్‌లు సెప్టెంబర్ 22 (శుక్రవారం) నుండి స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి. ఆపిల్ వాచ్ సిరీస్ 9 ధరలు రూ.41,900 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది.

కొత్త ఆపిల్ వాచ్‌లోని డిస్‌ప్లే 2000 నిట్స్   వరకు బ్రైట్ నెస్ అందిస్తుంది. ఇంకా  8 సిరీస్ కంటే రెండింతలు బ్రైట్ నెస్  ఉంటుంది. అలాగే, వాచ్ సిరీస్ 9  డిస్‌ప్లే  రాత్రి మొత్తం  డార్క్  మోడ్ లో ఉంటుంది.


ఆపిల్   9 సిరీస్ వాచ్ సిరి అసిస్టెంట్‌తో కొత్త ఫీచర్లను పొందుతుంది. పాత మోడల్ కంటే రెండింతలు అక్యురసీ కూడా చెప్పబడింది. ఆపిల్ వాచ్ సిరీస్ 9   వాచ్ ఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. స్మార్ట్ స్టాక్, సైక్లింగ్ వంటివి రీడిజైన్ చేయబడ్డాయి. వాచ్ సిరీస్ 9లో మెంటల్  హెల్త్ ఫీచర్ కూడా ఉంది.
 

ఆపిల్ వాచ్ సిరీస్ 9లో  కొత్త అల్ట్రా వైడ్ బ్యాండ్ (UWB) ప్రాసెసర్‌  ఉంది, దీని ద్వారా Find My Apps ఫీచర్‌ని ఉపయోగించడం ఈజీ  చేస్తుంది. హోమ్‌పాడ్‌తో వాచ్ సిరీస్ 9ని పెయిర్ చేయడం అండ్ బూట్ చేయడం కూడా ఈ ప్రాసెసర్‌తో ఈజీ.

ఆపిల్ వాచ్ సిరీస్ డబుల్ ట్యాప్ ఫీచర్‌తో సహా అన్ని ముఖ్యమైన ఫీచర్‌లతో వస్తుంది. దీనితో యూజర్లు  వాచ్ ద్వారా మొబైల్ కాల్స్  వంటి అనేక పనులను సులభంగా చేయవచ్చు. ఆపిల్ వాచ్ కొత్త ఫైన్‌వోవెన్ బ్యాండ్‌తో వస్తుంది.  హెర్మేస్ అండ్  నైక్‌ల సహకారంతో కొత్త బ్యాండ్‌లను కూడా తీసుకొచ్చింది.

Latest Videos

click me!