ఇన్‌స్టాగ్రామ్‌లో అద్భుతమైన ఫీచర్.. డిలెట్ చేసిన పోస్ట్‌లను ఈ విధంగా రిస్టోర్ చేయవచ్చు..

First Published Feb 3, 2021, 6:40 PM IST

ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్  వినియోగదారులకు గిఫ్ట్ లాంటి  ఒక గొప్ప ఫీచర్  ప్రారంభించింది. ఇన్‌స్టాగ్రామ్  కొత్త అప్ డేట్  తర్వాత, మీరు డిలెట్ చేసిన పోస్ట్‌లను  చూడవచ్చు ఇంకా వాటిని కలనుకుంటే రిస్టోర్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ గురించి కంపెనీ ఒక బ్లాగ్ ద్వారా సమాచారం ఇచ్చింది.

ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్ పరిచయం చేసిన తర్వాత మీరు గత 30 రోజులలో డిలెట్ చేసిన పోస్ట్‌లను రిస్టోర్ చేయవచ్చు. డిలెట్ చేసిన పోస్ట్‌లను తిరిగి రిస్టోర్ చేసిన ఆప్షన్ ఇన్‌స్టాగ్రామ్ యాప్ సెట్టింగ్‌లలో కనిపిస్తుంది. ఈ ఫీచర్ ఫోటో, వీడియో, రీల్స్ ఐజిటివి వీడియోకి పని చేస్తుంది.
undefined
ప్రత్యేక విషయం ఏమిటంటే కొత్త అప్ డేట్ తరువాత, వినియోగదారులు వారి ఇన్‌స్టా స్టోరీలను కూడా రిస్టోర్ చేయగలుగుతారు,
undefined
కొత్త అప్ డేట్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి డిలెట్ చేసిన ఫోటోలు, వీడియోలు, రీల్స్, ఐజిటివి వీడియోలు టైమ్‌లైన్ నుండి తొలగించబడతాయి, కాని కంపెనీ వాటిని రీసెంట్ డిలెట్ ఫోల్డర్‌లో ఉంచుతుంది, ఇక్కడ నుండి మీరు వాటిని 30 రోజుల్లోగా తిరిగి రిస్టోర్ చేసుకోవచ్చు.
undefined
మీరు ఇన్‌స్టాగ్రామ్ లో ఈ ఫీచర్ ఆస్వాదించాలనుకుంటే, మొదట మీ యాప్ అప్ డేట్ చేయండి. దీని తరువాత, యాప్ సెట్టింగులకు వెళ్లి, ఖాతాకు వెళ్లి, ఆపై రీసెంట్ డిలెట్ ఆప్షన్ ఎంచుకోండి. (సెట్టింగులు> అక్కౌంట్> రీసెంట్లీ డిలెట్)
undefined
undefined
click me!