SGH-E700 మొబైల్ అనేది ఇంటర్నల్ యాంటెన్నాతో Samsung మొదటి మొబైల్. శామ్‌సంగ్ ప్రకారం, మొబైల్ వినియోగాన్ని పాపులర్ చేయడంలో ఇంకా మొబైల్ ఫోన్ పరిశ్రమలో శామ్‌సంగ్ ని అభివృద్ధి చేయడంలో ఈ మొబైల్ ముఖ్యమైన పాత్ర పోషించింది.
ఈ దేశాల్లోని ప్రజలు Samsung అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ఫోన్ అరుదైన మొబైల్ ఫోన్‌లను సేకరించేవారిని ఇంకా టెక్ ఔత్సాహికులను ఆకర్షిస్తుందని Samsung భావిస్తోంది.
Samsung ప్రకారం, కొత్తగా లాంచ్ చేసిన Galaxy Z Flip5 రెట్రో మొబైల్ కొరియా, UK, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ ఇంకా ఆస్ట్రేలియాతో సహా కొన్ని దేశాలలో పరిమిత సంఖ్యాలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ భారతదేశంలో లాంచ్ అవుతుందా లేదా అనే విషయంపై ఎటువంటి సమాచారం లేదు.
అయితే గతంలో శాంసంగ్ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్లు చాలా వరకు భారత మార్కెట్లోకి రాకపోవడంతో Galaxy Z Flip5 Retro భారత్‌లోకి రావడం అనుమానమే అంటున్నారు టెక్ నిపుణులు. ముఖ్యంగా, Samsung ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్‌ను USలో కూడా లాంచ్ చేయలేదు. మరోవైపు దీని ధర గురించి Samsung నుండి ఎటువంటి సమాచారం లేదు.
Galaxy Z Flip5 Retro స్మార్ట్‌ఫోన్ అయినప్పటికీ, SGH-E700 ఫోన్ నుండి ప్రత్యేకమైన ఫీచర్స్ ని ప్యాక్ చేస్తుంది. ఇండిగో బ్లూ, సిల్వర్ కలర్ స్కీమ్, పాత పిక్సెల్ గ్రాఫిక్స్ UI ఇంకా ఫ్లెక్స్ విండోలో ప్రత్యేకమైన యానిమేషన్ ఉంటుంది.
Galaxy Z Flip5 Retroని కొనే కస్టమర్‌లకు Samsung లోగోలతో కూడిన గిఫ్ట్ కార్డ్‌లు, ఫ్లిప్‌సూట్ కేస్‌ను గిఫ్ట్ గా అందించడం కూడా గమనించదగ్గ విషయం.