5G డేటా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్.. అది కూడా ఒక్కరికి కాదు ముగ్గురికి ఫ్రీ.. బెస్ట్ ప్లాన్..

First Published | Apr 22, 2024, 3:37 PM IST

మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేసి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి OTT సబ్‌స్క్రిప్షన్స్  ఉపయోగిస్తున్నారా.. దేశీయ టెలికాం రిలయన్స్  Jio నుండి ఈ ప్లాన్ తీసుకున్న తర్వాత మీరు అధిక ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అవును... రిలయన్స్ జియో ఇప్పుడు  కస్టమర్లకు  అలాంటి ప్లాన్‌ను అందిస్తోంది, అదికూడా  ఫ్రీ...
 

దీనితో పాటు మీరు ఈ ప్లాన్‌తో మరో సిమ్, 5G డేటా, ఫ్రీ కాల్స్  వంటి బెనిఫిట్స్ పొందుతారు. జియో ఈ రూ. 699 ప్లాన్ ఆన్ లిమిటెడ్  కాలింగ్‌తో వస్తుంది. 100GB డేటా అంతే కాకుండా 100 SMS ఫెసిలిటీ అందించబడుతుంది.
 

వీటితో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోకు సబ్‌స్క్రిప్షన్స్ కూడా అందిస్తుంది. జియో ఈ రూ. 699 ప్లాన్ ఒక నెల ఫ్రీ  ట్రయల్‌తో వస్తుంది. ఈ ప్లాన్‌తో మీ కుటుంబంలోని మూడు సిమ్స్ యాడ్ చేయవచ్చు. ఒక్కో సిమ్‌ను యాడ్ చేయడానికి రూ.99 ఛార్జ్ వసూలు చేస్తుంది.
 


ఈ ప్లాన్ జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌కు ఫ్రీ  సబ్‌స్క్రిప్షన్  కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో మీకు 100 GB  డైలీ డేటా లభిస్తుంది. అది అయిపోతే ఒక్కో జీబీకి రూ.10 చొప్పున ఛార్జ్  చేస్తారు.
 

Latest Videos

click me!