Tech News: ఆ విషయంలో చైనా బ్రాండ్‌ల దూకుడు.. మరీ శాంసంగ్ , ఆపిల్ పరిస్థితి ఏమిటి?

Published : Jul 22, 2025, 11:38 AM IST

Tech News: స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీలో రోజుకో కొత్త మార్పు వస్తుంది. తాజాగా చైనా కంపెనీలు ఏకంగా 10,000mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీలతో స్మార్ట్ ఫోన్‌లను తయారు చేస్తున్నాయి.  శాంసంగ్, గూగుల్, ఆపిల్ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు గట్టి సవాళ్లు విసురుతున్నాయి.

PREV
17
ప్రీమియం బ్రాండ్‌లకు కఠిన పోటీ!

ఇటీవల కాలంలో యువత అధికంగా స్మార్ట్ ఫోన్లను వాడుతోంది. ముఖ్యంగా సూపర్ స్మార్ట్ ఫోన్లలో గేమ్స్,  సోషల్ మీడియా వినియోగించే వారి సంఖ్య క్రమేపి పెరుగుతుంది. ఇలాంటి వారిని టార్గెట్ చేస్తూ చైనా కంపెనీలు 10,000mAh బ్యాటరీలతో ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. 

ఇప్పటికే రియల్ మీ (Realme) భారీ బ్యాటరీ గల ఫోన్‌ను తీసుకరాబోతున్నట్లు ప్రకటించింది. అదనంగా Honor, Vivo, Oppo,  Xiaomi వంటి ఇతర చైనా బ్రాండ్‌లు కూడా వచ్చే ఏడాది పెద్ద బ్యాటరీలతో ఫోన్‌లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో శాంసంగ్, ఆపిల్, గూగుల్ వంటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల మధ్య పోటీ రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది.  

27
బడ్జెట్ ధరలో భారీ బ్యాటరీ ఫోన్

ఈ మధ్యకాలంలో తక్కువ బడ్జెట్ లోనే భారీ బ్యాటరీ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి.   ఇలాంటి  ఫోన్లనే యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే.. ఎక్కువసేపు గేమింగ్, స్ట్రీమింగ్, సోషల్ మీడియా వాడకం వంటి పనులకు నిరంతరాయంగా ఉపయోగించుకోవచ్చు.

తాజాగా హానర్ (Honor) 8,300mAh బ్యాటరీ సామర్థ్యంతో X70 మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.  అలాగే.. వివో (Vivo), వన్ ప్లస్ (OnePlus), పోకో( Poco), ఐక్యూ (iQOO) వంటి ఇతర బ్రాండ్‌లు కూడా అధిక బ్యాటరీ సామర్థ్యం కలిగిన  బడ్జెట్  అండ్ మిడ్‌రేంజ్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకరాబోతున్నట్టు ప్రకటించాయి. 

37
త్వరలో చార్జింగ్ మర్చిపోయే రోజులు

ఇటీవల విడుదలైన POCO F7 5G ఫోన్  7,550mAh బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోస్ట్ పవర్ ఫుల్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా పరిగణించబడుతోంది. ఇదే ధోరణిలో చైనా కంపెనీలు విడుదల చేయబోయే అనేక కొత్త మోడల్స్‌లో కనీసం 7,000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీలు ఉండబోతున్నట్లు సమాచారం. 

47
కొత్త ట్రెండ్‌కు నాంది

తాజాగా హానర్ (Honor) కేవలం 7.76mm మందం ఉన్న ఓ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సన్నని డిజైన్‌లోనే పవర్ పుల్ బ్యాటరీని అమర్చింది  ఇటీవల కాలంలో డిజైన్‌కి ప్రాధాన్యత ఇస్తూనే, బ్యాటరీ సామర్థ్యాన్ని తగ్గించకుండా రూపొందించడం ట్రెండ్‌గా మారుతోంది. ఇదే అంశంపై ప్రముఖ చైనా టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ (DCS), Weiboలో ఆసక్తికర సమాచారం షేర్ చేశారు.  వచ్చే ఏడాదిలో చైనా బ్రాండ్‌లు మధ్యస్థ బడ్జెట్ శ్రేణిలో 10,000mAh బ్యాటరీలతో స్మార్ట్‌ఫోన్‌లు విడుదల చేయాలని యోచిస్తున్నాయని తెలిపారు.

57
సిలికాన్-కార్బన్ టెక్నాలజీతో విప్లవం

గతంలోనే పలు కంపెనీలు పెద్ద బ్యాటరీ ఫోన్‌లను విడుదల చేయడం మానుకున్నాయి, ఎందుకంటే పెద్ద బ్యాటరీలు ఫోన్ బరువును పెంచి, డిజైన్‌పై ప్రభావం చూపేవి. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి మారుతోంది. చైనా కంపెనీలు తాజాగా సిలికాన్-కార్బన్ బ్యాటరీలు అనే కొత్త సాంకేతికతను అవలంబిస్తున్నారు. ఈ బ్యాటరీలు సాధారణ లిథియం అయాన్ బ్యాటరీల కంటే అధిక సామర్థ్యం కలిగి ఉంటాయి, అలాగే చాలా కాంపాక్ట్ డిజైన్‌లో అమర్చవచ్చు. ఈ ఆవిష్కరణ వల్ల స్మార్ట్‌ఫోన్  ప్రధాన సర్క్యూట్ బోర్డు (PCB) పరిమాణాన్ని కూడా తగ్గించవచ్చు.

67
సిలికాన్-కార్బన్ vs లిథియం-అయాన్ బ్యాటరీలు

ఒకవైపు చైనా బ్రాండ్‌లు సిలికాన్-కార్బన్ బ్యాటరీలు వాడుతూ స్లిమ్ అండ్ పవర్ పుల్ గేమింగ్ స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తుండగా..  మరోవైపు సామ్సంగ్, గూగుల్, ఆపిల్ వంటి ప్రముఖ బ్రాండ్‌లు ఇప్పటికీ లిథియం-అయాన్ (Li-ion) బ్యాటరీలనే వినియోగిస్తున్నాయి. లిథియం-అయాన్ బ్యాటరీలు బరువుగా, పెద్దదిగా ఉండటం వల్ల కాంపాక్ట్ గా ఫోన్లను తయారు చేయలేకపోతున్నారు. 

77
ధరపై కాదు.. బ్యాటరీ సామర్థ్యంపై ఫోకస్

ప్రస్తుతం వినియోగదారులు ఫోన్ ధరపై కాకుండా బ్యాటరీ సామర్థ్యాన్ని చూస్తున్నారు. ఉదాహరణ:  సామ్సంగ్ తాజాగా  Galaxy S25 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ ను మార్కెట్ లోకి తీసుకవచ్చింది. ఇందులో  కేవలం 4,000mAh బ్యాటరీ మాత్రమే ఉంది, దీని ధర దాదాపు ₹75,000. 

ఇదే సమయంలో చైనా తయారీదారులు రూ.10,000 బడ్జెట్‌లోనే 6,000mAh వరకు బ్యాటరీ సామర్థ్యం గల ఫోన్‌లను అందిస్తున్నారు. ఈ  భారీ బ్యాటరీ సామర్థ్యం వలన ఫోన్‌ను తరచుగా రీచార్జ్ చేయాల్సిన అవసరం లేదు. దీని వల్ల డైలీ యూజ్‌కి మెరుగైన అనుభవం కలుగుతుంది. చార్జింగ్ టైం తగ్గడంతో పాటు, లాంగ్-లాస్టింగ్ బ్యాటరీ లైఫ్‌ను కోరే యూజర్ల కోసం ఇది గొప్ప మార్గం అవుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories