తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌ కోసం చూస్తున్నారా.? రూ. 12 వేల నుంచే ప్రారంభం..

First Published | Dec 16, 2024, 6:45 PM IST

Laptop: ఈకామర్స్ సంస్థల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగానే కంపెనీలు ల్యాప్‌టాప్‌లపై మంచి డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ప్రస్తుతం ల్యాప్‌టాప్స్‌పై అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ స్కీమ్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ప్రస్తుతం ల్యాప్‌టాప్‌ల వినియోగం భారీగా పెరిగింది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులతో పాటు స్కూళ్లకు వెళ్లే విద్యార్థుల వరకు ల్యాప్‌టాప్‌ వినియోగం అనివార్యంగా మారింది. దీంతో తక్కువ బడ్జెట్‌లో ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. మరి రూ. 20 వేల బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ ల్యాప్‌టాప్‌ల గురించి మీకోసం.. 
 

లెనోవో ల్యాప్‌టాప్‌..

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో Lenovo Chromebook MediaTek Kompanio 520 ల్యాప్‌టాప్‌ అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ అసలు ధర రూ. 28000 కాగా 58 శాతం డిస్కౌంట్‌తో రూ. 11,900కి లభిస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌ మీడియాటెక్‌ Kompanio 520 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. క్రోమ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌లో 14 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు. ఇక ఈ ల్యాప్‌టాప్‌ను హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 750 డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. 
 


ఏసర్ ఆస్పైర్‌ 3..

రూ. 20 వేల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ ల్యాప్‌టాప్స్‌లో ఏసర్ ఆస్పైర్ 3 ఇంటెల్ సెలెరాన్ డ్యూయల్ కోర్ N4500 ల్యాప్‌టాప్‌ ఒకటి. ఈ ల్యాప్‌టాప్‌ అసలు ధర రూ. 30,999కాగా ప్రస్తుతం అమెజాన్‌లో 32 శాతం డిస్కౌంట్‌తో రూ. 20,999కి లభిస్తోంది. పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ పొందో అవకాశం లభస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ ల్యాప్‌టాప్‌ ఇంటెల్ సెలెరాన్‌ డ్యూయల్‌ కోర్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో తీసుకొచ్చారు. విండోస్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌లో 14 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. 
 

అసుస్‌ క్రోమ్‌ బుక్‌..

తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ ల్యాప్‌టాప్‌లో ASUS Chromebook ఇంటెల్ సెలెరాన్ డ్యూయల్ కోర్ N4500 ఒకటి. అమెజాన్‌లో ఈ ల్యాప్‌టాప్‌పై మంచి ఆఫర్ లభిస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌ అసలు ధర రూ. 32,999కాగా అమెజాన్‌లో 36 శాతం డిస్కౌంట్‌తో రూ. 20,999కే లభిస్తోంది. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ ల్యాప్‌టాప్‌ ఇంటెల్ సెలెరాన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌తో ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చారు. ఇందులో 14 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. 

Latest Videos

click me!