కలలో కూడా ఊహించని ఆఫర్‌.. 75 ఇంచెస్ టీవీపై ఏకంగా 75 శాతం డిస్కౌంట్‌

First Published | Dec 14, 2024, 4:01 PM IST

ప్రస్తుతం స్మార్ట్‌ టీవీలకు డిమాండ్ పెరుగుతోంది. ఓటీటీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పెద్ద స్క్రీన్‌ టీవీలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పెద్ద టీవీలు ధర ఎక్కువగా ఉండడం సహజమే. అయితే ఈ కామర్స్‌ సంస్థల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ఊహకందని ఆఫర్లను ప్రకటిస్తున్నారు. అలాంటి ఓ బెస్ట్‌ డీల్‌ గురించి ఈరోజు తెలుసుకుందాం.. 
 

సాధారణంగా 75 ఇంచెస్‌ల స్మార్ట్‌ టీవీని కొనుగోలు చేయాలంటే తక్కువలో తక్కువ రూ. 3 లక్షల వరకు అయిన చెల్లించాల్సిందే. అయితే ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో ఓ స్మార్ట్‌ టీవీపై కళ్లు చెదిరే ఆఫర్‌ లభిస్తోంది. కేవలం రూ. 65 వేలకే ఏకంగా 75 ఇంచెస్‌ టీవీని సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఇంతకీ ఏంటా టీవీ.? అందులో ఉన్న ఫీచర్లు ఏంటంటే.. 
 

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ టీసీఎల్‌పై అమెజాన్‌లో మంచి ఆఫర్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్‌ టీవీ అసలు ధర రూ. 2,54,990గా ఉండగా అమెజాన్‌లో 74 శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నారు. దీంతో ఈ టీవీని రూ. 66,990కి సొంతం చేసుకోవచ్చు. అయితే డిస్కౌంట్‌ ఇక్కడితోనే ఆగిపోలేదు పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1300 వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది దీంతో ఈ టీవీని రూ. 65 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఈ ధరలో 75 ఇంచెస్‌ టీవీ లభించడం నిజంగానే బెస్ట్ డీల్‌గా చెప్పొచ్చు. 
 

Tap to resize

ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మెటాలిక్‌ బెజల్‌ లెస్‌ స్క్రీన్‌ను అందించారు. 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌ ఎల్‌ఈడీ స్క్రీన్‌ ఈ టీవీ సొంతం. ఇక 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ టీవీలో 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందించారు. అలాగే క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌తో ఈ టీవీ పని చేస్తుంది. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో 2.4జీహెచ్‌జెడ్‌/5జీహెచ్‌జెడ్‌ డ్యూయల్ బ్యాండ్ వైఫై ఫీచర్‌ను అందించారు. అలాగే మల్టీపుల్‌ ఐ కేర్‌ ఈ టీవీ ప్రత్యేకతగా చెప్పొచ్చు. 
 

గూగుల్ అసిస్టెంట్‌కు సపోర్ట్‌ చేసే ఈ టీవీలో ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌, జీ5, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఓటీటీ యాప్స్‌లో కంటెంట్‌ వీక్షించవచ్చు. సౌండ్ విషయానికొస్తే ఇందులో 30 వాట్స్‌ అవుట్‌పుట్‌కు సపోర్ట్‌ చేసే డాల్బీ ఆడియో స్పీకర్లను అందించారు. కంపెనీ టీవీపై 2 రెండేళ్ల మ్యానిఫ్యాక్చర్‌ వారంటీని అందిస్తోంది. ఈ స్క్రీన్‌ను కనీసం 7.5 ఫీట్స్‌ దూరం నుంచి వీక్షించాలని కంపెనీ చెబుతోంది. అలా అయితే కళ్లపై పెద్దగా ప్రభావం పడదన్నమాట. 
 

ఇక ఈ టీవీలో ప్రత్యేకంగా డైనమిక్‌ కలర్‌ ఎన్‌హాన్స్‌మెంట్ అనే ఫీచర్‌ను అందించారు. అలాగే మెటాలిక్‌ బ్లేజ్‌ లెస్‌ స్క్రీన్‌ కావడం వల్ల స్క్రీన్‌ సైజ్‌ పెద్దగా కనిపిస్తుంది. 178 డిగ్రీ వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌ను ఇచ్చారు. దీంతో ఏ దిక్కు నుంచి చూసిన స్క్రీన్‌ స్పష్టంగా కనిపిస్తుంది. బ్లూటూత్‌, యూఎస్‌బీ, హెచ్‌డీఎమ్‌ఐ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ఏవీఐ, ఎమ్‌పీఈజీ మీడియా ఫార్మట్‌కు ఈ టీవీ సపోర్ట్‌ చేస్తుంది. 
 

Latest Videos

click me!