భారీ బ్యాటరీతో వస్తున్న ఒప్పో సరికొత్త 5జి స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ తెలుసుకోండి..

First Published Jan 26, 2021, 11:22 AM IST

చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తాజాగా 5జి స్మార్ట్ ఫోన్ ఒప్పో ఎ55ను  చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఒప్పో ఎ55   5జి  మోడల్ 6జి‌బి  ర్యామ్ తో  మీడియాటెక్ డైమెన్సిటీ 700 SoC చేత శక్తినిస్తుంది. ఈ ఫోన్ లో  భారీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.  3.5 ఎంఎం ఆడియో జాక్‌తో పాటు ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్‌ కూడా ఉంది. ఒప్పో ఎ55 5జి వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాతో వస్తుంది.

ఒప్పో ఎ55ను 5జి ధరకొత్త ఒప్పో ఎ55 5జి 6జి‌బి ర్యామ్ + 128జి‌బి స్టోరేజ్ ధర చైనాలో సి‌ఎన్‌వై 1,599 అంటే సుమారు రూ .18వేలు. బ్రిస్క్ బ్లూ, రిథమ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. జే‌డి.కంతో సహా చైనాలోని ఆన్‌లైన్ రిటైలర్ల ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
undefined
ఒప్పో ఎ55 5జి ఫీచర్స్స్పెసిఫికేషన్లకు అనుగుణంగా డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 11-బేస్డ్ కలర్‌ఓఎస్ 11. ఫోన్ 88.7 స్క్రీన్-టు-బాడీ రేషియో, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 269 పిపి పిక్సెల్ డెన్సిటీ, 480 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది. 6 జీబీ ర్యామ్‌తో జత చేసిన మీడియాటెక్ డైమెన్సిటీ 700 సోసీ ఈ ఫోన్‌కు శక్తినిస్తుంది. స్టోరేజ్ మరింత విస్తరించుకునే ఆప్షన్ కోసం 1TB వరకు ఎక్ష్టెర్నల్ స్టోరేజ్ సపోర్ట్, 128జి‌బి ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు.
undefined
ఇమేజింగ్ విషయానికొస్తే, ఒప్పో ఎ55 5జిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, ఎఫ్ 2.2 ఎపర్చరు, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఎఫ్ 2.4 ఎపర్చరు, అదనంగా 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి. వెనుక కెమెరా మోడ్‌లలో నైట్ సీన్, ప్రొఫెషనల్, పనోరమిక్, పోర్ట్రెయిట్, టైమ్ లాప్స్, స్లో మోషన్, సూపర్ టెక్స్ట్, అల్ట్రా-క్లియర్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఫోన్ 10x డిజిటల్ జూమ్ వరకు సపోర్ట్ చేస్తుంది. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఎఫ్ 2.0 ఎపర్చర్‌ కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా షూటింగ్ మోడ్లలో పనోరమా, పోర్ట్రెయిట్, నైట్ సీన్, టైమ్ లాప్స్, ఏ‌ఐ ఐడి ఫోటో ఇంకా మరిన్ని ఉన్నాయి.
undefined
ఒప్పో ఎ55 5జిలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. కనెక్టివిటీ ఆప్షన్స్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, వై-ఫై 5 (802.11ac),బ్లూటూత్ వి 5.1, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ సైజ్ 163.9x75.7x8.4mm,దీని బరువు 186 గ్రాములు. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
undefined
click me!