Jio 599 Plan Offer : జియో నుంచి అన్ లిమిటెడ్ ప్లాన్..రోజుకు రూ.19లకే 4జీ అన్ లిమిటెడ్ డేాటా..

First Published | Apr 1, 2023, 10:58 AM IST

రిలయన్స్ రూ. 599 నెలవారీ ప్లాన్ ద్వారా కస్టమర్లు అపరిమితమైన వాయిస్ కాలింగ్, అపరిమితమైన 4G డేటా, రోజుకు 100 SMSలను ఆఫర్ చేస్తోంది. 

jio

భారతీయ టెలికాం మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జియో  మరో సంచలనానికి తెరతీసింది. పరిశ్రమలో మొదటి సారిగా అపరిమితమైన డేటా ఆఫర్‌తో ముందుకు వచ్చింది. రూ. 599 నెలవారీ ప్లాన్ ద్వారా కస్టమర్లు అపరిమితమైన వాయిస్ కాలింగ్, అపరిమితమైన 4G డేటా, రోజుకు 100 SMSలను ఆఫర్ చేస్తోంది. 
 

అలాగే వినియోగదారులు, JioTV, JioCinema, JioCloudతో సహా మరిన్ని Jio యాప్‌ సేవలను ఉచితంగా పొందే వీలుంది. జియో వెల్‌కమ్ ఆఫర్ కింద అర్హత కలిగిన వినియోగదారులకు అపరిమితమైన Jio True 5G డేటా కూడా లభిస్తుంది. 
 


ప్రీపెయిడ్ నుండి పోస్ట్‌పెయిడ్‌కు మారాలనుకొనే వారికి, ప్రీమియం సేవలను అనుభవించాలనుకునే కొత్త కస్టమర్‌లకు జియో ఈ ప్లాన్ యొక్క 30-రోజుల ఉచిత ట్రయల్‌ని కూడా అందిస్తోంది. సరికొత్త 599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ ఇప్పటికే కస్టమర్ల ఆదరణను అందుకుంది.

రోజుకు కేవలం రూ. 19 అతి తక్కువ ఖర్చుతో వినియోగదారులు ఒకే ప్లాన్‌తో మల్టిపుల్ ప్రయోజనాలను పొందడమే లక్ష్యంగా జియో ఈ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. 

Latest Videos

click me!