దేశంలో రోజురోజుకీ ఓటీటీ సేవలు పెరుగుతున్నాయి. మారిన టెక్నాలజీతో పాటు వినోద మాధ్యమాలలో కూడా మార్పులు వచ్చాయి. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత ఓటీటీ మార్కెట్ భారీగా పెరిగింది. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతుంటే మరికొన్ని చిత్రాలు థియేటర్లలో వచ్చిన కొద్ది రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. దీంతో రోజురోజుకీ ఓటీటీ యూజర్ల సంఖ్య పెరుగుతోంది. ఇక భారత్‌లో అత్యధికంగా సబ్‌స్క్రైబర్లను కలిగి ఉన్న అమెజాన్ ప్రైమ్ వీడియో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
అమెజాన్ ప్రైమ్ కేవలం కంటెంట్‌కు మాత్రమే పరిమితం కాకుండా ఈ కామర్స్‌లో షాపింగ్ బెనిఫిట్స్‌ను కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. దీంతో చాలా మంది అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అమెజాన్ ప్రైమ వీడియోకు సంబంధించి టర్మ్స్‌ను సవరించింది. కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయం జవనరి నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ మేరకు యూజర్లకు ఇమెయిల్స్ పంపిస్తోంది.
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారు ఒకేసారి ఐదు డివైజ్‌లను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. డివైజ్‌లతో సంబంధం లేకుండా ఈ సదుపాయం కల్పించారు. దీంతో ఒకరు సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే మరో నలుగురు బెనిఫిట్స్ పొందో అవకాశం ఉండేది. ఏ డివైజ్ అన్నది సంబంధం లేకుండా వీడియోలను చూసుకునే అవకాశం ఉంది. అయితే డివైజ్‌లను సంఖ్యను అలాగే ఉంచిన అమెజాన్ తాజాగా టీవీల సంఖ్యపై మాత్రం పరిమితిని విధించింది.
ఒకేసారి రెండు కంటే ఎక్కువ టీవీల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోను చూడాలనుకుంటే మరో కనెక్షన్ తీసుకోవాల్సిందేనని తెలిపింది. సెట్టింగ్స్ పేజీలోని మేనేజ్ ఆప్షన్ ద్వారా డివైజులను మేనేజ్ చేసుకోవచ్చని అమెజాన్ తమ యూజర్లకు పంపించిన మెయిల్స్‌లో స్పష్టం చేసింది. అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఒకేసారి రెండు టీవీల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలను వీక్షించే అవకాశాన్ని యూజర్లు కోల్పోయారని చెప్పాలి. అయితే ఒకరు లాగవుట్‌లో ఉన్న సమయంలో మరో యూజర్ టీవీలో లాగిన్ అవ్వొచ్చు.
ధరల విషయానికొస్తే..
ఇదిలా ఉంటే ఉంటే ప్రస్తుతం అమెజాన్ ఇయర్లీ సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 1499గా ఉంది. మూడు నెలలకు రూ. 599, నెలకు రూ. 299గా నిర్ణయించారు. దీంతో పాటు ప్రైమ్ లైట్ పేరుతో నెలకు రూ. 799 ప్లాన్‌ను కూడా అమెజాన్ అందిస్తోంది. అయితే ఈ ప్లాన్ తీసుకున్న వారికి స్ట్రీమింగ్ సమయంలో ప్రకటనలు వస్తాయి. స్ట్రీమింగ్‌తో సంబంధం లేకుండా కేవలం షాపింగ్ ప్రయోజానలు మాత్రమే కావాలనుకునే వారు రూ. 399 చెల్లిస్తే ఏడాది వ్యాలిడిటీ పొందొచ్చు.