Smart phone: పక్కవారు మీ ఫోన్‌లో ఏం చూశారో ఎలా తెలుసుకోవాలా.? ఎవరికీ తెలియని ట్రిక్‌

Published : Mar 20, 2025, 01:37 PM IST

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగం అనివార్యంగా మారింది. దేశంలో జనాభా కంటే ఫోన్‌ల సంఖ్యే ఎక్కువగా ఉందంటే నమ్ముతారా.? అయితే స్మార్ట్‌ ఫోన్‌లో మనకు తెలియని ఎన్నో ట్రిక్స్ ఉన్నాయని తెలుసా. అలాంటి ఒక ట్రిక్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
13
Smart phone: పక్కవారు మీ ఫోన్‌లో ఏం చూశారో ఎలా తెలుసుకోవాలా.? ఎవరికీ తెలియని ట్రిక్‌

ఒకప్పుడు ఫోన్‌ అంటే కేవలం దూర ప్రాంతంలో ఉన్న వారితో మాట్లాడుకోవడానికి ఉపయోగించే ఒక వస్తువు మాత్రమే. కానీ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌తో చేయలేని పని లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  చాటింగ్ మొదలు సోషల్‌ మీడియా వరకు, టికెట్‌ బుకింగ్స్‌ మొదలు మనీ ట్రాన్స్‌ఫర్ల వరకూ అన్నింటికీ స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగపడుతుంది. 
 

23

దీంతో ఫోన్‌ను పక్కవారికి ఇవ్వాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే పక్కవారు మన ఫోన్‌ తీసుకుంటే అందులో ఏం చూశారో రీసెంట్లీ వ్యూడ్‌ ట్యాబ్స్‌ నొక్కి చూసుకోవచ్చు. అయితే దానిని కూడా క్లియర్‌ చేసే అవకాశం ఉంటుంది. మరి అలా క్లియర్‌ చేసినా కూడా మన ఫోన్‌లో ఎదుటి వ్యక్తి ఏం చెక్‌ చేశాడు. ఏయే యాప్స్‌ను చూశాడు.? లాంటి వివరాలను తెలుసుకోవడానికి ఒక ట్రిక్‌ ఉందని మీకు తెలుసా.? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

33

* ఇందుకోసం ముందుగా మీ ఫోన్‌లో డైలర్‌ ప్యాడ్‌ను ఓపెన్‌ చేయాలి. 

* అనంతరం *#*#4838#*#* అనే నెంబర్‌కు డయల్‌ చేయాలి. 

* ఇలా చేసిన వెంటనే మీ ఫోన్‌ స్క్రీన్‌పై టెస్టింగ్ పేరుతో ఒక పేజీ ఓపెన్‌ అవుతుంది. 

* ఇందులో ఫోన్‌ ఇన్ఫర్మేషన్‌, యూసేజ్‌ స్టాటస్టిక్స్‌, వైఫై ఇన్ఫర్మేషన్‌ వంటి మూడు ఆప్షన్స్‌ కనిపిస్తాయి. 

* వీటిలో 'యూసేజ్‌ స్టాటస్టిక్స్' అనే ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. అనంతరం 'లాస్ట్‌ టైమ్‌ యూజ్డ్‌'ను సెలక్ట్‌ చేసుకోవాలి. 

*  వెంటనే మీ ఫోన్‌లో రీసెంట్‌గా ఏయే యాప్స్‌ను యాక్సెస్‌ చేశారనే వివరాలు వస్తాయి. ఇలా పక్కవారు మీ ఫోన్‌లో ఏం చూశారో తెలుసుకోవచ్చు. 
 

Read more Photos on
click me!

Recommended Stories