2019 ఒక కాళరాత్రి: ‘సంక్షోభాల’ మధ్య హువావే

First Published Dec 25, 2019, 3:49 PM IST

5జీ నెట్ వర్క్ అభివ్రుద్ధి చేసిన ఫలితం చైనా స్మార్ట్ ఫోన్ మేజర్ ‘హువావే’ను సమస్యల్లోకి నెట్టేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హుంకరించారు. హువావే విక్రయాలపై నిషేధం విధించారు. గూగుల్ సహా టెక్ సంస్థలన్నీ ఫాలో అయ్యాయి. హువావే కూడా గట్టిగానే రిటార్ట్ ఇచ్చింది. సొంత ఆపరేటింగ్ ఆండ్రాయిడ్ సిస్టం రూపకల్పనపై కేంద్రీకరించింది. కానీ సంస్థ అధినేత రెన్ ఝెంగ్జీఫై గారాల పట్టి ఏడాది కాలంగా అమెరికా కుటిల నీతితో కెనడాలోని ఒక గెస్ట్ హౌస్‌లో బంధీగా ఉండటమే ఆయనకు ఇబ్బందికరంగా మారింది. 

న్యూఢిల్లీ: అంతర్జాతీయ సమాజానికి టెలికం రంగంలో ‘5జీ’ సేవలందించేందుకు రంగం సిద్ధం చేసుకున్న సంస్థ ‘హువావే’. ఇది చైనాలోని స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థల్లో ఒకటి. అమెరికాను మించి 5జీ టెక్నాలజీని అభివ్రుద్ధి చేయడం ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌నకు కోపం తెప్పించింది. ఫలితంగా అమెరికాలో హువావే ఫోన్ల వినియోగంపై విధించిన నిషేధం.. ఆ సంస్థ అంతర్జాతీయ వ్యాపారంపై ప్రతికూల ప్రభావమే చూపిందని చెప్పాలి. ఇది కేవలం బిజినెస్ అంశం మాత్రమే కాదు. ఇతర అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఏతావాతా హువావే సంస్థకు, దాని యాజమాన్యానికి 2019 ఒక ‘కాళరాత్రి’గా మిగిలిపోనున్నది మాత్రం వాస్తవం అని టెక్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. హువావే చరిత్రలో తొలిసారి 2019లోనే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నది.
undefined
సరిగ్గా ఏడాది క్రితం గతేడాది డిసెంబర్ నెలలో హువావే అధినేత రెన్ ఝెంగీఫై గారాల పట్టి, సంస్థ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ మెంగ్ వాంగ్ ఝూను అమెరికా అభ్యర్థనపై కెనడా అరెస్ట్ చేసింది. ఇరాన్‌పై తాము విధించిన ఆంక్షలను తోసి రాజంటూ ఆ దేశంతో వ్యాపార సంబంధాలు పెట్టుకున్నదని మెంగ్ పై అమెరికా చేసిన ఆరోపణ. ప్రస్తుతం ఆమె బెయిల్ పై విడుదలైనా జీపీఎస్ ఎనేబుల్డ్ వాంకోవర్ సిటీలో కర్ఫ్యూ మధ్య ఒంటరిగా ఉన్నారు. ఆమె తండ్రి రెన్ ఝెంగ్ ఫీ తన కూతురు అరెస్ట్ రాజకీయ ప్రేరేపితం, ఆరోపణలన్నీ సత్య దూరమని స్పష్టం చేశారు.
undefined
హువావే వ్యాపార సీక్రెట్లను తస్కరిస్తున్నదని అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు గత జనవరిలో అభియోగాలు సిద్ధం చేశారని వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక వార్తా కథనం ప్రచురించింది. హువావేపై 23 ఇండిక్ట్ మెంట్లు, వైర్ ఫ్రాడ్, న్యాయం అందకుండా అడ్డంకులు కల్పించిందని అమెరికా ప్రాసిక్యూషన్ వాదన. అమెరికాలో తమ పరికరాల వాడకంపై ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని మార్చిలో న్యాయస్థానంలో హువావే సవాల్ చేసింది. హువావే కంపెనీతో మే నెలలో అమెరికాలోని టెక్ కంపెనీలు సంబందాలు తెంచుకోవడంతో అసలు సమస్య వచ్చి పడింది. google
undefined
హువావే వ్యాపార సీక్రెట్లను తస్కరిస్తున్నదని అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు గత జనవరిలో అభియోగాలు సిద్ధం చేశారని వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక వార్తా కథనం ప్రచురించింది. హువావేపై 23 ఇండిక్ట్ మెంట్లు, వైర్ ఫ్రాడ్, న్యాయం అందకుండా అడ్డంకులు కల్పించిందని అమెరికా ప్రాసిక్యూషన్ వాదన. అమెరికాలో తమ పరికరాల వాడకంపై ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని మార్చిలో న్యాయస్థానంలో హువావే సవాల్ చేసింది. హువావే కంపెనీతో మే నెలలో అమెరికాలోని టెక్ కంపెనీలు సంబందాలు తెంచుకోవడంతో అసలు సమస్య వచ్చి పడింది. google
undefined
ప్రత్యేకించి గూగుల్ తమ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం హువావే లో పని చేయదని ప్లే స్టోర్స్, మ్యాప్స్, జీ మెయిల్ లో లభించదని తేల్చేసింది. ఓపెన్ సోర్స్ ద్వారా తీసుకుని వాడుకోవాల్సిందనని స్పష్టం చేసింది. ఇంకా క్వాల్ కామ్, వైఫై అలయన్స్, ఎస్డీ అలయెన్స్, ఏఆర్ఎం, ఇంటెల్ సంస్థలు కూడా సెర్చింజన్ ‘గూగుల్’తో జత కలిశాయి. అదే మే నెలలో హువావే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు.. సొంతంగా హార్మోనీ ఓఎస్ పేరిట ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం రూపొందిస్తామని హువావే చెబుతున్నట్లు వార్తలొచ్చాయి. ఆగస్టులో అధికారికంగా హార్మోనీ ఓఎస్ ఆవిష్కరిస్తామని హువావే ప్రకటించింది. ఈ ఓఎస్ వ్యవస్థ స్మార్ట్ ఫోన్లు, లాప్ టాప్స్, టీవీలు, వాచీల్లో వాడుకోవచ్చని సంకేతాలిచ్చింది. రష్యా సెర్చ్ జెయింట్ యాండెక్స్ సహకారంతో సొంత ఆండ్రాయిడ్ సిస్టం రూపుదిద్దుకుంటుందని వార్తలొచ్చాయి. ఆ వెంటనే దాని అనుబంధ హానర్ విజన్ ప్రో అనే స్మార్ట్ టీవీని విపణిలోకి విడుదల చేసింది. తర్వాత ఈ ఏడాదికి మాత్రం హార్మోనీ ఓఎస్ తో కూడిన స్మార్ట్ ఫోన్ విడుదల చేయడం లేదని హువావే సీనియర్ మేనేజ్మెంట్ సంకేతాలిచ్చింది. ఈ నెల ప్రారంభంలో కంపెనీ నూతన సాఫ్ట్ వేర్ సాయంతో ఫోన్లు, టాబ్లెట్లు విడుదల చేస్తామని ప్రకటించింది. అంతకుముందు అక్టోబర్ నెలలో హువావే తన ఫ్లాగ్ షిప్ ఫోన్ ‘మేట్ 30 ప్రో’ను వాటర్ పాల్ డిస్ ప్లే, క్వాడ్ కెమెరా సిస్టంతో విడుదల చేసింది. ఈ ఫోన్ లో గూగుల్స్ ప్లే స్టోర్ మిస్ కావడం గమనార్హం. గూగుల్ ప్లే స్టోర్ వాడకంపై నిషేధం అమల్లోకి రాగానే హువావే ఫోన్ల విక్రయాలు పడిపోయాయి. అయితే క్యూ3లో 18 శాతం వాటా పొందింది. చైనాలో మాత్రం 41.5 మిలియన్ల ఫోన్లను విక్రయించింది. తర్వాతీ కాలంలో అంటే జూన్ నెలలో హువావే కార్యకలాపాలు, విక్రయాలు చేసుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం 90 రోజుల గడువు ఇచ్చింది. తదుపరి మరోదపా 90 రోజులు గడువు పొడిగించింది. కానీ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఆదేశాలు రాలేదు. అయితే నవంబర్ నెలలో అమెరికా వాణిజ్య శాఖ మంత్రి విల్బర్ రోస్ స్పందిస్తూ హువావేతో తొలిదశ ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది చైనా, అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేస్తే హువావేకు తిరిగి గూగుల్ యాప్స్ లభిస్తాయి.
undefined
5g 5జీ నెట్‌వర్క్ విస్తరణకు హువావే సేవలు తప్పనిసరి. కానీ అమెరికాతో గల స్నేహం వల్ల బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ కూడా ఆ సంస్థపై నిషేధం విధించడాన్ని సమర్ధిస్తున్నాయి. కానీ మార్కెట్ అవకాశాలు పుష్కలంగా ఉన్న భారత్, మలేషియా వంటి దేశాలు మాత్రం 5జీ రోల్ ఔట్ కోసం హువావేకు స్వాగతం పలుకడం గమనార్హం.
undefined
click me!