అత్యంత చౌకధరకే ‘మోటో ఈ6ఎస్’.. ఆ 3ఫోన్లతో ‘సై’ అంటే ‘సై’

First Published Sep 17, 2019, 2:35 PM IST

లెనెవో అనుబంధ మోటరోలా సంస్థ విపణిలోకి మోటో ఈ6ఎస్ ఫోన్ ఆవిష్కరించింది. కేవలం రూ.7,999లకే లభిస్తున్న ఈ ఫోన్ లాంఛింగ్ ఆఫర్ కింద రూ.2200 జియో రీచార్జి కూపన్లు లభిస్తున్నాయి. ఇంకా రియల్ మీ, రెడ్ మీ, ఇన్ ఫినిక్స్ హాట్ ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది.

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లెనెవో అనుబంధ మోటరోలా భారతదేశ విపణిలోకి మరొక స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. అందుబాటులో ఉన్న ధరకే తీసుకొచ్చిన ‘మోటో ఈ6ఎస్’ను సోమవారం విపణిలో ఆవిష్కరించింది. అంతేకాదు మోటో ‘ఈ’ సిరీస్‌లో వచ్చిన తొలి డ్యూయల్ రియర్ కెమెరా ఫోన్ ఇదే కావడం ఆసక్తికర పరిణామం. దీంతోపాటు బ్యాక్ కవర్ మార్చుకునే వెసులుబాటు కూడా ఈ ఫోన్‌లో రిమూవబుల్ బ్యాటరీని ఉపయోగించడం మరో విశేషం.మోటో ఈ6ఎస్ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ రామ్ ఇన్ బిల్ట్ స్టోరేజీ సామర్థ్యం కల ఫోన్ ధర రూ.7,999 మాత్రమే. ఈ నెల 23వ తేదీ నుంచి వాల్‌మార్ట్ అనుబంధ ఫ్లిప్ కార్ట్ సంస్థ ద్వారా ఆన్‌లైన్‌లో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా రూ.2,200 విలువైన క్యాష్ బ్యాక్, రూ.3000 విలువైన క్లియర్ ట్రిప్ ఓచర్లు లభిస్తాయి.
undefined
డ్యూయల్ సిమ్ గల మోటో ఈ6ఎస్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్‌పై పని చేస్తుంది. 6.1 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, ఆక్టా కోర్ మీడియా టెక్ హీలియో పీ 22 ప్రాసెసర్ తదితర ఫీచర్లు కలిగి ఉంది. 4జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్‌లో 13 ఎంపీ + 2 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతోపాటు 64 జీబీ ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజీ దీని కెపాసిటీ. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 512 జీబీ ర్యామ్ వరకు పెంచుకునే వెసులుబాటు మోటో ఈ6ఎస్ ఫోన్‌లో ఉంది.
undefined
మోటో ఈ6ఎస్ మోడల్ ఫోన్ 3000 ఎంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ కలిగి ఉంది. అదే సమయంలో ఇన్‌ఫినిక్స్ హాట్ 8 ఫోన్ కూడా రూ.7999లకే మార్కెట్‌లో అందుబాటులో ఉండటం గమనార్హం. రియల్ మీ 3ఐ ఫోన్ కూడా ఇదే ధరకు లభిస్తుంది. ఇంకా రెడ్ మీ 7 ఫోన్ ధరను రూ.7499లకు తగ్గించి వేశారు. ఈ నాలుగు ఫోన్లు డ్యూయల్ సిమ్ ఆఫర్లతో, నానో సిమ్ కార్డ్ స్లాట్లతో లభిస్తున్నాయి. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ కలిగి ఉన్నాయి. మోటో ఈ6ఎస్, రెడ్ మీ 7 ఫోన్లు 512 జీబీ ర్యామ్ సామర్థ్యం గల ఎస్డీ కార్డు, ఇన్ ఫినిక్స్ హాట్ 8, రియల్ మీ 3ఐ ఫోన్లలో 256 జీబీ సామర్థ్యం గల మైక్రో ఎస్డీ కార్డులు పని చేస్తున్నాయి. అంతే కాదు. ఫోన్లన్నీ ఆండ్రాయిడ్ 9పై ఓఎస్ తో పని చేస్తుండటం మరో ఆసక్తికర పరిణామం. దాదాపు నాలుగు ఫోన్లు ఆక్టాకోర్ మీడియా టెక్ హెలియో పీ22 ఎస్వోసీతో పని చేస్తున్నాయి.
undefined
click me!