న్యూఢిల్లీ: చైనా మొబైల్స్ తయారీ సంస్థల మధ్య పోటీ మొదలైంది. లెనోవా సొంతమైన మోటరోలా భారత మార్కెట్‌లో చౌక ధరలకే పలు ఆండ్రాయిడ్ టీవీలను విడుదల చేసింది. ఇటు షియోమీ, అటు వన్ ప్లస్ సంస్థలకు చెక్ పెట్టేందుకు మోటరోలా ముందుకు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ సహకారంతో 32, 43, 50, 55, 65 ఇంచుల డిస్‌ప్లే పరిమాణాల్లో ఆరు కొత్త స్మార్ట్ టీవీలను సోమవారం మోటరోలా లాంచ్ చేసింది. భారతదేశంలో స్మార్ట్‌టీవీలకు పెరుగుతున్నఆదరణ నేపథ్యంలో స్మార్ట్ టీవీ మార్కెట్‌పై దృష్టి పెట్టడానికి వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్త వ్యూహంతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
undefined
ప్రధానంగా షియోమీకి షాకిచ్చేలా ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ సందర్భంగా ఈ నెల 29వ తేదీ నుంచి ఈ టెలివిజన్లు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. దాదాపు షియోమీ ఎంఐ టీవీల మాదిరి ఫీచర్లు, అదే ధరతో వీటిని తీసుకొచ్చింది మోటరోలా. మరోవైపు షియోమీ మంగళవారం భారతదేశ విపణిలో 65 అంగుళాల టీవీని విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. 32 అంగుళాల నిడివి గల మోటరోలా కొత్త టీవీ రూ.14 వేల లోపే కస్టమర్లకు అందుబాటులోకి వస్తుంది. అతి తక్కువ ధరకు హై క్వాలిటీ టీవీని అందిస్తున్నది మోటరోలా టీవీ. తద్వారా వన్ ప్లస్, షియోమీలకు పోటీనిచ్చేందుకు సంసిద్ధం అవుతోంది మోటరోలా. విపణిలోకి మోటరోలా తీసుకొచ్చిన ఆరు టీవీలు ఆండ్రాయిడ్ 9 ఆధారంగా, నిరంతరాయమైన గేమింగ్ అనుభవం కోసం గేమింగ్ కంట్రోలర్ సపోర్ట్‌తో పనిచేస్తాని కంపెనీ తెలిపింది.
undefined
స్క్రీన్ షిఫ్ట్, ఆటో టూన్ ఎక్స్ డిస్ప్లే టెక్నాలజీ, జీ 10 బిట్ కలర్ డెప్త్ వంటి ఫీచర్లు జోడించింది. 49, 55 అంగుళాల టీవీలు 2జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్, మాలి-450 జిపియు, 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. 32, 43-అంగుళాల ఫుల్‌హెచ్‌డీ టీవీలు 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఇవి 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 20 డబ్ల్యూ సౌండ్ ఔట్‌పుట్‌తో వస్తాయి.
undefined
మరోవైపు ప్రజాదరణ పొందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వన్ ప్లస్’ నుంచి స్మార్ట్ టీవీ రానున్నదని భారతదేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎనిమిది స్పీకర్లతో అట్టహాసంగా విపణిలోకి స్మార్ట్ టీవీని విపణిలోకి తేవాలని వన్ ప్లస్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే స్మార్ట్ టీవీ మార్కెట్లో వీయూ, ఎంఐ వంటి సంస్థల ఉత్పత్తులు ఉన్నా వన్ ప్లస్ బ్రాండ్ వాల్యూ రీత్యా ఆ కంపెనీ విడుదల చేసే స్మార్ట్ టీవీల గురించి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వన్ ప్లస్ టీవీకి మోటరోలా టీవీ గట్టి పోటీ ఇస్తుందని అంతా అంటున్నారు.
undefined
డాల్బీ విజన్, హెచ్డీఆర్10 వంటి విజువల్ ఫీచర్లు గలిగి ఉండటంతోపాటు మోటరోలా టీవీలు రకరకాల రేంజీల్లో దొరుకనున్నాయి. మోటోరోలా స్పీడ్ చూస్తుంటే రాబోయే వన్‌ప్లస్ టీవీ మార్కెట్‌కి ఎంతో కొంత గండి కొట్టేలా ఉందంటున్నారు పరిశీలకులు.
undefined