Sanju Samson: శుభ్‌మన్ గిల్ టీ20 వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందడం, అతని పేలవమైన టీ20 రికార్డు దృష్ట్యా సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. జహీర్ ఖాన్ గిల్ ఎంపికను సమర్థిస్తూనే, సంజు శాంసన్ టీ20 ప్రదర్శనలపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
టెస్ట్, వన్డే ఫార్మాట్‌లో తన అద్భుతమైన ప్రదర్శనలతో శుభ్‌మన్ గిల్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనల కారణంగానే అతడు టీ20 ఫార్మాట్‌లో వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు. టెస్ట్, వన్డేలలో గిల్ రికార్డులు అత్యుత్తమంగా ఉన్నప్పటికీ.. టీ20 ఫార్మాట్‌లో మాత్రం అతని గణాంకాలు నిరాశపరిచేలా ఉన్నాయి. అయినప్పటికీ, అతడికి డైరెక్ట్‌గా వైస్ కెప్టెన్ ప్రమోషన్ లభించడం, బీసీసీఐ గిల్‌ను భవిష్యత్తు కెప్టెన్‌గా చూస్తోందని స్పష్టం చేసిన సంగతి కూడా తెలిసిందే.
25
గిల్ ప్రమోట్ అవ్వడం తప్పేంటి.?
గిల్ ప్రమోట్ అయినప్పటికీ, అతను ఇప్పటివరకు ఆడిన ఎనిమిది టీ20 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్‌లో పెద్దగా నిరూపించుకోలేకపోయాడు. ఇక గిల్ కోసం ఏ ప్లేయర్‌నైతే బలి చేశారో, అతడే సంజు శాంసన్. శాంసన్‌కు గిల్ కంటే మెరుగైన టీ20 రికార్డే ఉంది. ఈ విషయంపై మాజీ భారత బౌలర్ జహీర్ ఖాన్ స్పందించాడు. గిల్, అగార్కర్‌లను వెనకేసుకుని వస్తూ జహీర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
35
మూడు సెంచరీలు అంతేగా..
గిల్ ప్రమోట్ చేయడాన్ని తప్పుపడుతూనే.. సంజూ శాంసన్ గణాంకాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. శాంసన్ ఆడిన 13 ఇన్నింగ్స్‌లలో 417 పరుగులు చేశాడు. అయితే, ఈ 417 పరుగులలో మూడు సెంచరీలు ఉన్నాయి. అంటే కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే సంజు శాంసన్ అద్భుతంగా ఆడాడని, మిగిలిన 10 మ్యాచ్‌లలో అతని మొత్తం పరుగులు కేవలం 100 మాత్రమేనని జహీర్ ఖాన్ వివరించాడు.
దీని ప్రకారం చూస్తే సగటున 10 పరుగులు మాత్రమే సంజు శాంసన్ చేశాడని జహీర్ పేర్కొన్నాడు. శాంసన్‌పై వేటు వేయడం సరికాదని జరుగుతున్న ప్రచారాన్ని తాను అర్థం చేసుకోగలనని.. అయితే అగార్కర్, సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్‌లకు వేరే మార్గం లేదని జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డారు. టీ20 ప్రపంచకప్‌నకు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదని.. కానీ ప్రస్తుతం సంజు శాంసన్‌ను బెంచ్ చేయడం తప్ప వారికి వేరే అవకాశం లేదని పేర్కొన్నాడు. ఇక ఈ విధంగా అగార్కర్, సూర్యకుమార్ యాదవ్, గంభీర్‌లను జహీర్ ఖాన్ సమర్థించడంపై అభిమానులు మండిపడుతున్నారు.
55
టీ20 జట్టు కూర్పు గందరగోళం
ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టు కూర్పు చాలా గందరగోళంగా ఉంది. బౌలర్లతో ఇబ్బందులు పడుతున్నారు. అర్ష్‌దీప్ సింగ్ వంటి బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. అతనికి తక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. గిల్ ఒకటి రెండు ఇన్నింగ్స్ ఆడితే.. అతడికే చోటు.. శాంసన్‌పై వేటు పడుతోంది. అటు రింకూ సింగ్ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఫినిషర్ పాత్రలో జితేష్ శర్మ దాదాపుగా స్థిరపడిపోయాడు.