చాహల్ నవ్వుల వెనక ఇంత బాధ దాగుందా..! ఎలా భరించావు సామీ

Published : Aug 01, 2025, 12:49 PM ISTUpdated : Aug 01, 2025, 12:52 PM IST

Chahal Dhanashree Divorce : భార్య ధనశ్రీతో విడాకుల తర్వాత తన పరిస్థితి ఎలా ఉండేదో తాజాగా వివరించారు యుజ్వేంద్ర చాహల్. దీంతో అతడి సరదా నవ్వుల వెనక ఎంత బాధ దాగుందో అర్థమవుతోంది.   

PREV
15
విడాకులపై చాహల్ సంచలన కామెంట్స్

Yuzvendra Chahal : క్రికెట్ గురించి అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పేరు చాహల్. తన బౌలింగ్ తోనే కాదు సరదా చేష్టలతో అభిమానులను అలరిస్తుంటాడు ఈ టీమిండియా క్రికెటర్. తోటి ఆటగాళ్లతోనే కాదు చనువు తీసుకుని మరీ విదేశీ క్రికెటర్లను కూడా ఆటపట్టిస్తూ అందరినీ నవ్విస్తుంటాడు.. అందుకే చాహల్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ఇలా ఎప్పుడూ సరదాగా కనిపించే చాహల్ నిజానికి అంత హ్యాపీగా లేడని తాజా కామెంట్స్ తో అర్థమవుతోంది.

ప్రస్తుతం చాహల్ కెరీర్ బాగానే ఉంది... భారత్ జట్టులోనే కాదు ఐపిఎల్ లో సక్సెస్ ఫుల్ స్పిన్నర్ గా కొనసాగుతున్నారు. కానీ అతడి వ్యక్తిగత జీవితమే సజావుగా సాగడంలేదు. ఎంతో ఇష్టపడి ప్రేమించిన అమ్మాయి ధనశ్రీ వర్మను పెళ్ళాడాడు చాహల్. కొంతకాలం హాయిగానే సాగిన వీరి సంసార జీవితం ఇటీవల విడాకులతో ముగిసింది. ఈ విడాకుల వ్యవహారం తనను చాలా బాధించిందని... ఓ స్థాయిలో సూసైడ్ ఆలోచనలు కూడా వచ్చాయని చాహల్ తాజాగా సంచలన విషయాలను బైటపెట్టాడు.

DID YOU KNOW ?
చాహల్ సంపాదన ఎంత?
టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్‌ బీసీసీఐ కాంట్రాక్టులు, ఐపీఎల్ ఒప్పందం, బ్రాండ్ డీల్స్, పెట్టుబడులతో భారీగానే సంపాదిస్తున్నారు. 2025 నాటికి చాహల్ నికర ఆస్తి రూ.45 కోట్లుగా అంచనా
25
చాహల్ మానసిక వ్యధ

భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన వ్యక్తిగత జీవితం, విడాకులు, డిప్రెషన్ గురించి తొలిసారి ఓ పాడ్‌కాస్ట్‌లో బహిరంగంగా మాట్లాడారు. తాజాగా రాజ్ శమాని అనే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో చాహల్ పాల్గొన్నారు. ఇందులోనే అతడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన క్షణాల గురించి స్పష్టంగా వివరించారు. ఈ ఏడాది మార్చిలో చాహల్ భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

పాడ్‌కాస్ట్‌లో చాహల్ మాట్లాడుతూ… “విడాకుల సమయంలో నా మెదడు పూర్తిగా పని చేయడం మానేసింది. డిప్రెషన్‌లోకి వెళ్లాను. ఆ సమయంలో రోజుకు కేవలం 2-3 గంటలే నిద్రపోయేవాణ్ని. మిగతా సమయం నా సన్నిహితులతో మాట్లాడుతూ గడిపేవాణ్ని. ఎంతొ ఇష్టమైన క్రికెట్ నుంచి కూడా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఒక దశలో ఆత్మహత్య గురించి కూడా ఆలోచించాను” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

డిప్రెషన్ వల్ల తన ముఖం కుంగిపోయేదని... ఎదుటివారికి తన బాధ స్పష్టంగా కనిపించేదని చాహల్ అన్నారు. అందుకే విడాకుల తర్వాత నాలుగు నుంచి ఐదు నెలలపాటు బయటకు వెళ్లే ధైర్యం కూడా తనకు లేకుండా పోయిందన్నారు. విడాకుల తర్వాత తనను మోసగాడిగా కొందరు పేర్కొన్నారు... కానీ అలాంటి మాటలు తాను పట్టించుకునేవాడిని కాదన్నారు చాహల్. “నేను ఎంత నిజాయితీగా ఉంటానో నాకు తెలుసు. అందుకే ఎవరేం అనుకున్నా పట్టించుకోలేదు” అని తెలిపారు.

35
మరో బంధానికి సిద్దంగా ఉన్నారా? : ఈ ప్రశ్నకు చాహల్ రియాక్షన్

భార్యతో విడాకులు తీసుకున్నారు? అయితే జీవితంలో ఎక్కడా ఆగకుండా ముందుకు సాగాల్సిందే... కాబట్టి మరో బంధానికి సిద్ధంగా ఉన్నారా? అన్న యాంకర్ ప్రశ్నకు చాహల్ స్పందించలేదు. చాలా విచిత్రంగా ముఖం పెట్టారు... దాని అర్థమేంటో కూడా తెలియకుండా. ఇలా ముఖకవలికలతోనే ఈ ప్రశ్నకు సమాధానం దాటవేశారు.

ఇక విడాకుల సమయంలో ‘Be Your Own Sugar Daddy’ అనే పదాలు ఉన్న టీషర్ట్ ధరించడంపైనా స్పందించారు చాహల్. దీని ద్వారా ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నానని చాహల్ తెలిపారు.

45
కెరీర్ పరంగా చాహల్ కు కఠిన క్షణాలివే..

కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న అతి కఠిన సమయం గురించి కూడా బైటపెట్టారు చాహల్. 2019 వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్‌ (భారత్ vs న్యూజిలాండ్) నెవర్‌ ఫెయిలింగ్ మూమెంట్‌గా పేర్కొన్నారు. ఆ మ్యాచ్‌లో తాను మరింత మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిందని చాహల్ అభిప్రాయపడ్డారు.

 క్రికెటర్ చాహల్ తో రాజ్ శమాని పాడ్‌కాస్ట్‌ వీడియో ఇక్కడ చూడండి.

55
చాహల్-ధనశ్రీ విడాకులు

యూట్యూబర్ ధనశ్రీ వర్మతో చాహల్ పరిచయం ఒక ఆన్‌లైన్ డాన్స్ క్లాస్ ద్వారా మొదలైంది. అక్కడ వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది… 2020 చివర్లో అంటే డిసెంబర్‌లో వీరు వివాహం చేసుకున్నారు. కానీ వారి దాంపత్య జీవితం ఎక్కువకాలం సాగలేదు. చివరికి మార్చి 2025లో ఇద్దరూ విడిపోయారు.

ఈ ఇంటర్వ్యూలో చాహల్ వ్యక్తిగతంగా ఎదుర్కొన్న మానసిక స్థితి, అవమానాలు, ఒత్తిడులు అన్నీ బహిరంగంగా వివరించడంతో అభిమానులు స్పందిస్తున్నారు. అంతగా నవ్వుతూ కనిపించే చాహల్ వెనుక ఉన్న బాధల జీవితం ఈ ఇంటర్వ్యూతో బయటపడింది.

Read more Photos on
click me!

Recommended Stories