Virat Kohli: బెంగళూరులో విరాట్ కోహ్లీకి చెందిన 'వన్8 కమ్యూన్' రెస్టారెంట్ అద్దె వివాదాల కారణంగా మూతపడింది. అద్దె బకాయిలు, నిర్వహణ ఖర్చులు చెల్లించలేదంటూ భవన యజమాని సివిల్ కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆ రెస్టారెంట్‌ను మూసివేయాలని ఆదేశించింది.
ఐపీఎల్ 2026లో విరాట్ కోహ్లీ బ్యాట్‌తో అదరగొడుతూ బెంగళూరు జట్టుకు వరుస విజయాలు అందిస్తున్న వేళ, ఆయనకు అనూహ్యమైన చిక్కులు ఎదురయ్యాయి. కోహ్లీకి ఎంతో ఇష్టమైన 'వన్8 కమ్యూన్' రెస్టారెంట్‌ను అద్దె వివాదాల కారణంగా మూసివేసినట్లు తెలుస్తోంది.
25
అద్దె బకాయిల వివాదం
బెంగళూరులోని ఒక ప్రైవేట్ వ్యక్తికి చెందిన భవనంలో విరాట్ కోహ్లీ ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. అయితే, గత కొంతకాలంగా ఈ హోటల్‌కు సంబంధించిన నెలవారీ అద్దె, నిర్వహణ ఖర్చుల చెల్లింపులో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది.
35
లక్షల రూపాయల బకాయిలు..
లక్షల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో, భవన యజమాని సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు, బకాయిలు చెల్లించే వరకు రెస్టారెంట్‌ను మూసివేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ చట్టపరమైన వివాదాలు, నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో విరాట్ కోహ్లీ అప్రమత్తమయ్యారు. తన బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో, బెంగళూరులోని ఈ హోటల్ భాగస్వామ్యం నుంచి ఆయన తప్పుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ రెస్టారెంట్ నిర్వహణ బాధ్యతలను ఒక ప్రైవేట్ హాస్పిటాలిటీ కంపెనీ చూసుకుంటోంది.
55
హోటల్ పునఃప్రారంభమయ్యే అవకాశం..
మైదానంలో విజయకేతనం ఎగురవేస్తున్న కోహ్లీకి, వ్యాపార పరంగా ఎదురైన ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. కోర్టు ఆదేశాల మేరకు బకాయిలు చెల్లించిన తర్వాతే ఈ హోటల్ పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది.