రాజు ఎక్కడైనా రాజేరా.. ఈ విషయంలో నిజంగానే కోహ్లీ తోపులకే తోపు..

Published : Jan 19, 2026, 07:14 PM IST

Virat Kohli: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆటతీరుతో విరాట్ కోహ్లీ టీమిండియాకు ఆశాదీపంగా నిలుస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి, కెరీర్‌లో 131వ సారి 50+ స్కోర్‌ను సాధించాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

PREV
15
గెలుపోటములు సర్వసాధారణం..

ఆట అన్నాక గెలుపోటములు సర్వసాధారణం. వాటిని స్పోర్టివ్‌గా స్వీకరించాల్సిన అవసరం ఉంది. అయితే, కొందరు క్రికెటర్లు మాత్రం గెలిచినా, ఓడినా తమ అసాధారణ ఆటతీరుతో ప్రత్యేకంగా నిలుస్తారు. జట్టు ప్రయోజనాలే పరమావధిగా దూసుకుపోతారు. అలాంటి అత్యున్నత స్థాయి ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ముందుంటాడు.

25
టాప్ క్లాస్ ఆటతీరు..

సంవత్సరాలుగా భారత జట్టుకు విలువైన సేవలు అందిస్తూనే, పరుగుల రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తనలో పరుగుల దాహం ఇంకా తీరలేదని నిరూపించుకుంటూ, యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతని టాప్ క్లాస్ ఆటతీరును నిలకడగా కొనసాగిస్తున్నాడు.

35
చివరి వరకు పోరాటం

న్యూజిలాండ్‌తో జరిగిన కీలకమైన వన్డే మ్యాచ్‌లో కూడా విరాట్ కోహ్లీ ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశాడు. ఒక దశలో టీమిండియా 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పటికీ, కోహ్లీ క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడు. న్యూజిలాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ, జట్టును ఆదుకోవడమే లక్ష్యంగా దృష్టి సారించాడు.

45
చేజింగ్‌లోనూ విరాట్ కోహ్లీ కింగ్..

ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే కాదు, చేజింగ్‌లోనూ విరాట్ కోహ్లీ ప్రత్యేకమైన ఆటగాడని మరోసారి నిరూపించాడు. ఈ మ్యాచ్‌లో అతను తన కెరీర్‌లో 131వ సారి 50 ప్లస్ స్కోర్‌ను సాధించాడు. ఈ అద్భుతమైన ఘనతను కేవలం 299 ఇన్నింగ్స్‌లలోనే అందుకున్నాడు. వన్డేల్లో కింగ్‌గా పేరు తెచ్చుకున్న కోహ్లీ, బ్యాటింగ్ ఆర్డర్‌లో టీమిండియాకు ఇప్పటికీ తాను అత్యంత కీలకమని మరోసారి చాటుకున్నాడు.

55
టీమిండియాకు విరాట్ కోహ్లీ సేవలు అవసరం..

వాస్తవానికి, ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత నుంచి విరాట్ కోహ్లీ తన ఫామ్‌ను ఏమాత్రం తగ్గించుకోలేదు. పరుగుల రేసులో టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాడు. అయితే, ఆస్ట్రేలియాతో సిరీస్ నుంచి పరిశీలిస్తే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరిలో కనీసం ఒక్కరైనా రాణించిన మ్యాచులు ఎక్కువగా ఉన్నాయి. రాబోయే వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుంటే టీమిండియాకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల సేవలు భారత జట్టుకు చాలా అవసరం అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories