తెలుగమ్మాయి అనన్య సివిల్స్ ర్యాంక్ వెనక విరాట్ కోహ్లీ ... అలాంటిది ఆర్సిబికి ఏంటీ దుస్థితి..!

First Published Apr 18, 2024, 12:40 PM IST

ఇటీవల వెలువడిన సివిల్స్ ఫలితాల్లో తెలుగమ్మాయి అనన్య రెడ్డి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించింది. అమ్మాయిల విషయంలో ఆమెదే టాప్ ర్యాంక్. అయితే ఆమె విజయం వెనక టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ వున్నాడట..

Virat Kohli

హైదరాబాద్ : విరాట్ కోహ్లీ... పరిచయం అక్కర్లేని పేరు. అంతర్జాతీయ క్రికెట్ లో రికార్డుల  ప్రస్తావన వస్తే ముందుగా వినిపించే పేరు కోహ్లీదే. తన బ్యాట్ తో పరుగుల వరద పారించే కోహ్లీ ఇప్పటికే క్రికెట్ గా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ రికార్డులెన్నింటినో బద్దలుకొట్టాడు. అలాగే వరల్డ్ క్రికెట్ లో ఎవరికీ సాధ్యంకాని సెంచరీలు, అర్ధసెంచరీలు బాది చరిత్ర లిఖించాడు. ఇలా కోహ్లీ పరుగుల ప్రవాహం, రికార్డుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. 

Donuru Ananya Reddy

పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లుగానే కోహ్లీ ఫ్యాన్స్ అందు సూపర్ ఫ్యాన్స్ వేరయా అనేలా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల వెలువడ్డ సివిల్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించిన తెలంగాణ ఆడబిడ్డ అనన్య రెడ్డి కూడా కింగ్ కోహ్లీ ఫ్యాన్ అట. ఈ విషయాన్ని స్వయంగా ఆమే తెలిపారు. ఈ క్రమంలోనే మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు అనన్య. తన విజయరహస్యం వెనక కూడా విరాట్ కోహ్లీ వున్నారని అనన్య తెలిపారు. 

Ananya Reddy

విరాట్ కోహ్లీ అద్భుతమైన క్రికెటర్... అందులో ఏమాత్రం డౌట్ లేదు. అతడు టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలు అనేకం వున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా కోహ్లీ చేసే పోరాటం తనకెంతో నచ్చుతుందని... ఓటమిని ఒప్పుకోని అతడి వైఖరి తనను చాలా స్పూర్తిని ఇచ్చిందని సివిల్స్ ర్యాంకర్ అనన్య రెడ్డి తెలిపారు. ఫలితం ఎలా వున్నా మన ప్రయత్నం మాత్రం ఆపకూడదనేది గొప్ప ఆటగాడు కోహ్లీ అంటూ కొనియాడారు. తనకు ఎంతో ఇష్టమైన క్రికెటర్ కోహ్లీ లాగే తానుకూడా ఎప్పుడూ నిరుత్సాహ పడకుండా సివిల్స్ ప్రిపరేషన్ సాగించానని... అతడిలాగే విజయం దక్కేదాక వదల్లేదని అనన్య రెడ్డి పేర్కొన్నారు. 

Kohli

సివిల్స్ ర్యాంకర్ కు స్పూర్తినిచ్చిన కోహ్లీ నుండి సొంత టీం ఎందుకు స్పూర్తిని పొందలేకపోతోందే..!

విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ క్రికెటర్ టీంలో వున్నా ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్ కొట్టలేకపోయింది. ప్రతిసారి కన్నడ ప్రజలు, కోహ్లీ ఫ్యాన్స్ 'ఈ సాలా కప్ నమదే'' (ఈ సారి కప్ మాదే) అనడం... ఎప్పటిలాగే ఆ జట్టు డిజాస్టర్ ఫెర్మామెన్స్ తో కప్ కాదు కదా సెమీ ఫైనల్ కూడా చేరలేకపోవడం మామూలే అయిపోయింది. ఐపిఎల్ 2024 లోనూ ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితే వుంది. ఈసారి కూడా విరాట్ కోహ్లీ ఒక్కడే ఆడుతున్నాడు... అతడొక్కడి పోరాటం జట్టును గెలిపించలేకపోతోంది. దీంతో వరుస ఓటములతో పాయింట్స్ టేబుల్ చివరన నిలిచింది బెంగళూరు జట్టు. 
 

RCB

కోహ్లీ పోరాటం, ఓటమిని  అంగీకరించని తత్వం ఓ సివిల్స్ విజేతకు స్పూర్తినిచ్చినప్పుడు తోటి ఆటగాళ్లు ఎందుకు స్పూర్తి పొందడంలేదనేదు ప్రశ్న. కోహ్లీలా ఆడకపోయినా సరే... కనీసం సహకారం అయినా అందించాలి కదా... అనేది సగటు ఆర్సిబి ఫ్యాన్ ఆవేదన. కోహ్లీ నుండి స్పూర్తిని పొంది ఆర్సిబి ఆటగాళ్ళంతా సమిష్టి పోరాటం చేస్తేనే ఆ టీం తలరాత మారేది. లేదంటే ప్రతిసారి ఫ్యాన్స్ ఆశలుపెట్టుకోవడం తప్ప కప్పు కొట్టడం సాధ్యంకాదని ఫ్యాన్స్ భావన.

Kohli

ఐపిఎల్ 2024  లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించింది విరాట్ కోహ్లీనే... అయితే ఆర్సిబి ఈసారి అద్భుతంగా ఆడుతుంది అనుకుంటే పొరబడినట్లే. కేవలం కోహ్లీ ఒక్కడే ఆడుతున్నాడు. దీంతో కోహ్లీ పరుగులు సాధిస్తున్నా ఆర్సిబి మాత్రం విజయం సాధించలేకపోతోంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఏడు మ్యాచులాడిన ఆర్సిబి ఆరు పరాజయాలను మూటగట్టుకుంది. కేవలం ఒకే ఒక విజయంతో ఎప్పటిలాగే పాయింట్స్ టేబుల్ లో చివరన నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. 

click me!