నా పోరాటం కొనసాగుతుంది.. కన్నీరు పెట్టుకున్న వినేష్ ఫోగట్

First Published | Aug 17, 2024, 5:08 PM IST

Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్‌లో ఫైన‌ల్ రెజ్లింగ్ మ్యాచ్‌కు ముందు అనర్హత వేటు పడిన భార‌త రెజ్ల‌ర్ వినేష్ ఫోగట్ స్వ‌దేశానికి తిరిగివ‌చ్చారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయటకు వ‌చ్చిన వెంట‌నే ఆమె తన తోటి రెజ్లర్ సాక్షి మాలిక్‌ను హత్తుకుని ఏడ్చేశారు.
 

Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్ 2024 లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఫైన‌ల్ కు చేరుకున్న భార‌త స్టార్ రెజ్ల‌ర్ వినేష్ ఫోగ‌ట్ స్వ‌దేశానికి చేరుకున్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినప్పుడు తీవ్ర బాధ‌తో కన్నీళ్లతో క‌నిపించారు. పారిస్ నుండి స్వ‌దేశంలో అడుగు పెట్టిన వినేష్ ఫోగ‌ట్ త‌న తొటి రెజ్ల‌ర్ల సాక్షి మాలిక్ ను హత్తుకుని బాధ‌ప‌డుతూ క‌న్నీరు పెట్టుకున్నారు. 

50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్లో వినేష్ 100 గ్రాములు అధిక బరువుతో ఉండటంతో అనర్హత‌కు గుర‌య్యారు. వినేష్ పోగ‌ట్ కు స్వాగతం పలికేందుకు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్‌లతో సహా కుటుంబం, స్నేహితులతోపాటు చాలా మంది అభిమానులు విమానాశ్రయం వ‌ద్ద‌కు వచ్చారు. 

Latest Videos


Vinesh Phogat

శనివారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు ఘన స్వాగతం లభించింది. వినేష్ రాజధానిలో అడుగుపెట్టడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. అర్హ‌త‌న వేటు క్ర‌మంలో రజత పతకం కోసం క్రీడల మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వినేష్ ఫోగట్ ఈ వారం ప్రారంభంలో కొట్టివేయబడింది. 

లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్, పారిస్‌లో భారత కాంటెంజెంట్ చీఫ్ డి మిషన్‌గా పనిచేశారు, విమానాశ్రయంలో వినేష్‌తో కలిసి ఛాంపియన్ అని పిలిచే ఫోటోను పంచుకున్నారు. వినేష్ స్ఫూర్తికి ఒలింపిక్ పతకం అవసరం లేదనీ, ఆమె త‌ర‌తరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

ఆమె సోదరుడు హర్విందర్ ఫోగట్ మాట్లాడుతూ..  "వినేష్ ఫోగ‌ట్ కు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి చాలా మంది చేరుకున్నారు. మా గ్రామంలో ఆమెకు స్వాగతం పలకడానికి ప్రజలు కూడా వేచి చూస్తున్నారు. వినేష్‌ని కలవడానికి, ఆమెను ప్రోత్సహించడానికి వారు ఉత్సాహంగా ఉన్నారు" అని తెలిపారు. 

click me!