Most Runs : వన్డేలు, టీ20ల్లో తోపు టాప్ 5 ప్లేయర్లు వీరే.. నెంబర్ వన్ ఎవరు?

Published : Jan 07, 2026, 09:50 AM IST

Top 5 Batters With Most Runs : వన్డేలు, టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 క్రికెటర్ల జాబితాలో ముగ్గురు భారత ప్లేయర్లు ఉన్నారు. సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించి విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు.

PREV
16
సచిన్‌ను వెనక్కి నెట్టిన కోహ్లీ.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టాప్-5 జాబితా ఇదే

క్రికెట్ ప్రపంచంలో టెస్టులది ఒక శైలి అయితే, వైట్ బాల్ క్రికెట్ ది మరో శైలి. వన్డేలు, టీ20ల్లో రాణించాలంటే కేవలం టెక్నిక్ ఉంటే సరిపోదు, వేగంగా పరుగులు రాబట్టే సామర్థ్యం కూడా ఉండాలి. బౌండరీ లైన్లను దాటిస్తూ, మైదానంలో పరుగుల వరద పారించిన దిగ్గజ బ్యాటర్లు క్రికెట్ చరిత్రలో కొందరే ఉన్నారు.

దశాబ్దాలుగా వన్డేలు, టీ20ల్లో అద్భుతమైన నిలకడను ప్రదర్శించి, రికార్డు స్థాయి ఇన్నింగ్స్‌లతో జట్లకు విజయాలను అందించిన ఐదుగురు అత్యుత్తమ బ్యాటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వైట్ బాల్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్ల వివరాలు గమనిస్తే టాప్ లో కోహ్లీ ఉన్నారు.

26
1. విరాట్ కోహ్లీ (18,745 పరుగులు)

ప్రస్తుత తరం క్రికెట్‌లో రన్ మెషీన్ గా పిలవబడే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. వన్డేలు, టీ20లు కలిపి కోహ్లీ ఏకంగా 18,745 పరుగులు సాధించాడు. ఈ గణాంకాలే అతన్ని వైట్ బాల్ క్రికెట్‌లో అల్టిమేట్ స్పెషలిస్ట్ గా నిలబెట్టాయి.

భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలనే అతడి పరుగుల ఆకలి, ఎటువంటి బౌలర్‌నైనా చెడుగుడు ఆడుకునే కోమ్లీ సామర్థ్యం అసాధారణం. విరాట్ క్రీజులో ఉన్నంతసేపు అభిమానులు సీట్ల అంచులపై ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ఏ ఫార్మాట్ అయినా పరుగుల దాహం తీర్చుకోవడంలో కోహ్లీకి సాటిలేరని ఈ రికార్డులే చెబుతున్నాయి.

36
2. సచిన్ టెండూల్కర్ (18,436 పరుగులు)

క్రికెట్ దేవుడిగా అభిమానులు కొలిచే లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. తన కెరీర్ మొత్తంలో వైట్ బాల్ క్రికెట్‌లో సచిన్ 18,436 పరుగులు సాధించాడు. సచిన్ బ్యాటింగ్ శైలిలో ఒక అలవోకతనం, గాంభీర్యం ఎప్పుడూ కనిపిస్తాయి. కాలాతీతమైన క్లాసిక్ షాట్ల నుంచి రికార్డు స్థాయి సెంచరీల వరకు సచిన్ ప్రయాణం అద్భుతం.

పవర్, కచ్చితత్వాన్ని మిళితం చేసి బ్యాటింగ్ చేయడంలో సచిన్ ఒక బెంచ్‌మార్క్‌ను సెట్ చేశాడు. ఆధునిక బ్యాటర్లు ఇప్పటికీ సచిన్ నెలకొల్పిన రికార్డులు, ప్రమాణాలను చేరుకోవాలని ఆశపడుతుంటారు అనడంలో అతిశయోక్తి లేదు.

46
3. రోహిత్ శర్మ (15,747 పరుగులు)

టీమిండియా మాజీ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డేలు, టీ20ల్లో కలిపి రోహిత్ 15,747 పరుగులు చేశాడు. తనదైన శైలిలో ఎలిగెంట్ షాట్లు ఆడటమే కాకుండా, పవర్ ప్లేలో బౌలర్లపై విరుచుకుపడటంలో రోహిత్ దిట్ట.

వన్డే క్రికెట్‌లో ఏకంగా మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. తన పేలుడు బ్యాటింగ్‌తో కేవలం ఒకే ఒక్క సెషన్‌లోనే మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగల సత్తా రోహిత్ సొంతం. అతడి భారీ షాట్లు క్రికెట్ లవర్స్ ను కనువిందు చేస్తాయి.

56
4. కుమార్ సంగక్కర (15,616 పరుగులు)

శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర వైట్ బాల్ క్రికెట్‌లో 15,616 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు. స్టైలిష్ బ్యాటింగ్‌కు, అద్భుతమైన నిలకడకు సంగక్కర మారుపేరు. టైమింగ్, ప్లేస్‌మెంట్‌లో అతడు మాస్టర్ అని చెప్పవచ్చు.

ఇన్నింగ్స్‌ను నిర్మించడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, జట్టుకు అవసరమైనప్పుడు వేగంగా పరుగులు సాధించడంలోనూ సంగక్కర సిద్ధహస్తుడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌలర్లకు అతడు ఒక కఠినమైన సవాలుగా నిలిచేవాడు. శ్రీలంక క్రికెట్ విజయాల్లో సంగక్కర పాత్ర ఎంతో ఉంది.

66
5. మహేల జయవర్ధనే (14,143 పరుగులు)

మరో శ్రీలంక లెజెండ్ మహేల జయవర్ధనే 14,143 పరుగులతో ఈ జాబితాలో ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. క్రీజులో ఎంత ప్రశాంతంగా ఉంటాడో, అతడి బ్యాటింగ్ కూడా అంతే క్లాస్సీగా ఉంటుంది. అద్భుతమైన షాట్ ఎంపిక, ఇన్నింగ్స్‌ను సరైన వేగంతో నడిపించే నేర్పు జయవర్ధనే సొంతం.

సవాలుతో కూడిన ఛేదనలోనూ, ఒత్తిడి సమయాల్లోనూ శ్రీలంక జట్టును విజయ తీరాలకు చేర్చడంలో జయవర్ధనే ఎప్పుడూ ముందుండేవాడు. అతడి బ్యాటింగ్ శైలి, నైపుణ్యం క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప వారసత్వాన్ని మిగిల్చాయి.

Read more Photos on
click me!

Recommended Stories