Shreyas Iyer: భారత టీ20 జట్టులో శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ మధ్య పోటీ అనివార్యంగా మారింది. గాయం తర్వాత తిలక్ గైర్హాజరీలో అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. మూడో స్థానంలో ఎవరు అత్యుత్తమం అనే చర్చ జరుగుతోంది.
భారత టీ20 జట్టులో శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. టెస్టిక్యులర్ సర్జరీ కారణంగా తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మూడు టీ20లకు దూరమయ్యాడు. ఇదే సమయంలో సుదీర్ఘ విరామం తర్వాత శ్రేయస్ అయ్యర్ టీ20 జట్టులోకి పునరాగమనం చేశాడు.
25
కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు.?
జట్టులో మూడో స్థానంలో ఎవరు బెస్ట్ అనే అంశంపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయ్యర్‌కు కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఉన్న అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని ఒక వాదన ఉంది.
35
అయ్యర్ నెంబర్ త్రీ గణాంకాలు..
అయితే, తిలక్ వర్మ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడని మరో చర్చ కొనసాగుతోంది. గణాంకాలను పరిశీలిస్తే, శ్రేయస్ అయ్యర్ 51 అంతర్జాతీయ టీ20లలో 1104 పరుగులు చేయగా, 8 అర్ధ సెంచరీలు సాధించాడు. మూడో స్థానంలో 19 ఇన్నింగ్స్‌లలో 530 పరుగులు, 4 అర్ధ సెంచరీలు చేశాడు.
మరోవైపు, తిలక్ వర్మ 40 అంతర్జాతీయ టీ20లలో 1183 పరుగులు చేసి, రెండు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు సాధించాడు. అతని బ్యాటింగ్ సగటు 49.29, స్ట్రైక్ రేట్ 144.09. మూడో స్థానంలో 15 మ్యాచ్‌లలో 542 పరుగులు, రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.
55
ఆ సిరీస్ కీలకం
రాబోయే న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లలో అయ్యర్ రాణిస్తే, తర్వాతి రెండు మ్యాచ్‌లలో తిలక్ వర్మకు తన సత్తా చాటాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. మొత్తంగా, 2026 టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టులో స్థానం కోసం వీరిద్దరి మధ్య పోటీ తప్పదని స్పష్టమవుతోంది.