2003 వన్డే వరల్డ్ కప్‌లో అంచనాలు లేకుండా బరిలో దిగి ఫైనల్ చేరింది టీమిండియా. ఆ టోర్నీలో సచిన్ టెండూల్కర్ 673 పరుగులు చేసి, ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అయితే ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది టీమిండియా..
Sachin Tendulkar
673 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది. సరిగ్గా 8 ఏళ్ల తర్వాత 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా, శ్రీలంకను ఓడించి టైటిల్ సాధించింది. తన కెరీర్‌లో ఆరు వరల్డ్ కప్స్ ఆడిన సచిన్ టెండూల్కర్, ఆఖరి ప్రపంచకప్‌లో టైటిల్ సాధించి రిటైర్మెంట్ తీసుకున్నాడు సచిన్ టెండూల్కర్...
Sachin and Messi
లియోనెల్ మెస్సీ విషయంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. బ్రెజిల్‌లో 2014 ఫిఫా వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరింది అర్జెంటీనా. అయితే ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీ చేతిలో 1-0 తేడాతో ఓడింది అర్జెంటీనా...
2014 ఫిఫా వరల్డ్ కప్‌లో 4 గోల్స్ చేసి, ఓ అసిస్ట్ గోల్‌తో ‘గోల్డెన్ బాల్’ అవార్డు గెలిచాడు లియోనెల్ మెస్సీ... సరిగ్గా 8 ఏళ్ల తర్వాత 2022 ఫిఫా వరల్డ్ కప్ టైటిల్‌ను గెలిచింది అర్జెంటీనా. ఐదు వరల్డ్ కప్స్ ఆడిన మెస్సీ, తన కెరీర్‌లో చివరి వరల్డ్ కప్‌లో టైటిల్ సాధించాడు..
Lionel Messi Bisht
క్రికెట్‌లో అత్యధిక వరల్డ్ కప్ మ్యాచులు ఆడిన ప్లేయర్ సచిన్ టెండూల్కర్ అయితే, ఫుట్‌బాల్‌లో ఆ రికార్డు లియోనెల్ మెస్సీ పేరిటే ఉంది...
అదీకాకుండా 2011 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై 85 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు సచిన్ టెండూల్కర్. 2022 ఫిఫా వరల్డ్ కప్ సెమీస్‌లో క్రొయేషియాపై ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు లియోనెల్ మెస్సీ..
messi
సచిన్ టెండూల్కర్ కూడా లియోనెల్ మెస్సీని తన అభిమాన ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పేర్కొనడం విశేషం. ‘రొనాల్డో కంటే మెస్సీ నాకు దగ్గరగా అనిపిస్తాడు. అతని జెర్సీ నెంబర్ కూడా 10యే’ అంటూ కామెంట్ చేసిన సచిన్ టెండూల్కర్.. ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనాకి శుభాకాంక్షలు తెలిపాడు.