అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్ కాదిది... మెస్సీ వర్సెస్ ఎంబాపే! ఫిఫా ఫైనల్‌లో చుక్కలు చూపించి...

First Published | Dec 19, 2022, 9:41 AM IST

ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచులన్నీ ఓ ఎత్తు అయితే ఫైనల్ మ్యాచ్‌ మరో ఎత్తు. మూడు గంటలకు పైగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌పై పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో విజయం అందుకుంది అర్జెంటీనా... అయితే ఫైనల్‌లో ఫ్రాన్స్ చూపించిన పోరాటం, ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైనల్‌గా నిలిపింది..

Image credit: Getty

ఆట 80వ నిమిషం వరకూ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న అర్జెంటీనా, మ్యాచ్‌ను వన్‌సైడెడ్‌గా గెలిచేలా కనిపించింది. అయితే ఆట ఆఖరి నిమిషాల్లో అద్భుతం చేశాడు ఫ్రాన్స్ కుర్రాడు కైలియన్ ఎంబాపే. ఒకటి, రెండు... మూడు.. ఏకంగా హ్యాట్రిక్ గోల్స్ సాధించి ఫ్రాన్స్ తరుపున ఒంటరి పోరాటం చేశాడు...
 

ఆట 23వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్‌ను వాడుకున్న లియోనెల్ మెస్సీలో గోల్ చేసి 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత ఆట 36వ నిమిషంలో ఏంజెల్ డి మరియా గోల్ కొట్టాడు. దీంతో 2-0 ఆధిక్యంలోకి వెళ్లిన అర్జెంటీనా... ఆట 80వ నిమిషం వరకూ మ్యాచ్‌లో తిరుగులేని ఆధిక్యం సాధించింది..


mbappe

అయితే వన్‌సైడెడ్‌గా సాగుతున్న మ్యాచ్‌ని ఇంట్రెస్టింగ్‌గా మార్చేశాడు ఎంబాపే. ఆట 80వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్‌ని గోల్‌గా మలిచిన ఎంబాపే, ఆ తర్వాత 80 సెకన్లకే మరో గోల్ చేశాడు. ఒక్క నిమిషం తేడాలో రెండు గోల్స్ రావడంతో డిఫెండింగ్ ఛాంపియన్‌ ఫ్రాన్స్ 2-2 తేడాతో కమ్‌బ్యాక్ ఇచ్చింది...

mbappe

ఎంబాపే మ్యాజిక్ అక్కడితో ఆగలేదు. నిర్ణీత సమయంలో ఫలితం తేలకపోవడంతో ఎక్స్‌ట్రా వరకూ సాగింది ఫైనల్ మ్యాచ్. ఆట 108వ నిమిషంలో మరో గోల్ చేసిన లియోనెల్ మెస్సీ... వన్ ఆఫ్ బెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా తనకి ఎందుకు ఇంత క్రేజ్ ఉందో నిరూపించుకున్నాడు..

మెస్సీ గోల్ చేసిన 10 నిమిషాలకు కెలియన్ ఎంబాపే మరో గోల్‌తో స్కోరును సమం చేశాడు. దీంతో 3-3 తేడాతో మరోసారి స్కోర్లు సమం అయ్యారు. దీంతో ఫలితం తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్‌ని ఎంచుకోగా అర్జెంటీనా 4, ఫ్రాన్స్ 2 ప్రయత్నాల్లో గోల్ సాధించాయి..

ఎంబాపే చూపించిన పోరాటానికి ఫుట్‌బాల్ ప్రపంచం ఫిదా అయిపోయింది. ఫైనల్ మ్యాచ్ అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్‌గా కాకుండా లియోనెల్ మెస్సీ వర్సెస్ ఎంబాపే‌గా సాగింది. ఇంకా చెప్పాలంటే ఫ్రాన్స్ తరుపున చివరి వరకూ ఒంటరి పోరాటం చేసి ‘గోల్డెన్ బూట్’ అవార్డు గెలుచుకున్నాడు కెలియన్ ఎంబాపే..  

Latest Videos

click me!