రోజర్ ఫెదరర్, నా కంటే గొప్పోడేం కాదు! అతను 20 గెలిస్తే, 23 గ్రాండ్ స్లామ్స్ గెలిచా... - సెరీనా విలియమ్స్

First Published | Jul 7, 2023, 3:30 PM IST

టెన్నిస్ ప్రపంచంలో తిరుగులేని సూపర్ స్టార్ రోజర్ ఫెదరర్. 24 ఏళ్ల సుదీర్ఘ ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్‌లో ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్, 8 సార్లు వింబుల్డన్, ఐదుసార్లు యూఎస్ ఓపెన్ గెలిచిన రోజర్ ఫెదరర్, 2009లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాడు. 

237 వారాల పాటు వరుసగా వరల్డ్ నెం.1 టెన్నిస్ ప్లేయర్‌గా నిలిచిన రోజర్ ఫెదరర్, 2005 నుంచి 2007 ఏళ్లలో వరుసగా టాప్‌లో నిలిచాడు. ఏకంగా 15 ఏళ్ల పాటు టాప్ 3లో నిలిచిన రోజర్ ఫెదరర్, 18 ఏళ్ల పాటు టాప్ 10లో కొనసాగాడు..
 

20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన రోజర్ ఫెదరర్, 429 గ్రాండ్ స్లామ్ మ్యాచుల్లో 369 మ్యాచులు గెలిచాడు. 58 సార్లు గ్రాండ్ స్లామ్ క్వార్టర్ ఫైనల్స్, 46 సార్లు సెమీ ఫైనల్స్ ఆడిన రోజర్ ఫెదరర్, తన కెరీర్‌లో 81 సార్లు మెన్స్ గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో పాల్గొన్నాడు..
 


పురుషుల టెన్నిస్ ప్రపంచంలో రోజర్ ఫెదరర్ లెజెండ్ అయితే, మహిళల టెన్నిస్ ప్రపంచంలో సెరీనా విలియమ్స్‌కి ఆ పొజిషన్ దక్కుతుంది. ఏడు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్, 3 సార్లు ఫ్రెంచ్ ఓపెన్, ఏడు సార్లు వింబుల్డన్, ఆరు సార్లు యూఎస్ ఓపెన్ గెలిచిన సెరీనా విలియమ్స్, డబుల్స్‌లోనూ 14 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచింది..

Image credit: Getty

సెరీనా విలియమ్స్, రోజర్ ఫెదరర్ మంచి స్నేహితులు కూడా. ఈ ఇద్దరూ ప్రత్యర్థులుగా కొన్ని ఎగ్జిబిషన్ మ్యాచులు ఆడినా అంతర్జాతీయ టోర్నీలో మాత్రం ఒకేసారి తలబడ్డారు. 2019లో పెర్త్‌లో జరిగిన హోప్‌మన్ కప్‌ మిక్స్‌డ్ డబుల్స్‌లో సెరీనా విలియమ్స్, రోజర్ ఫెదరర్ ప్రత్యర్థులుగా పోటీపడ్డారు..

ఆ మ్యాచ్‌లో రోజర్ ఫెదరర్ గురించి సెరీనా విలియమ్స్ చేసిన కామెంట్లను తాజాగా బయటపెట్టాడు అమెరికన్ టెన్నిస్ స్టార్ ఫ్రాసెస్ టోఫిక్. టెన్నిస్ టాక్ షోలో పాల్గొన్న ఫ్రాసెస్ టోఫిక్, టెన్నిస్ ప్రపంచంలో ముఖ్యంగా అమెరికా టెన్నిస్‌లో సెరీనా విలియమ్స్ ఇంపాక్ట్ గురించి కామెంట్లు చేశాడు..
 

Image credit: Wikimedia Commons

‘2019లో సెరీనాతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఆడుతున్నా. ఫెదరర్, బెలిందా మాకు ప్రత్యర్థులుగా ఉన్నారు. ఫెడ్ లెఫ్ట్, రైట్, సెంటర్ ఇలా వరుసగా ఏస్‌లు కొడుతూ ఆమెని అటు ఇటు పరుగెత్తించాడు. 

బ్రేక్ టైంలో తను నా పక్కనే కూర్చుంది.. ‘ఉఫ్.. నేను ఇది ఓడిపోకూడదు.. అతను నా కంటే బెస్ట్ కాదు. అతనికి 20 గ్రాండ్ స్లామ్స్ ఉంటే నాకు 23 ఉన్నాయి..’ అంది..
 

Serena Williams

ఆ మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ప్రత్యర్థి ఎవ్వరైనా సరే ఓడిపోవడానికి, తగ్గడానికి ఆమె అస్సలు ఇష్టపడదు...’ అంటూ చెప్పుకొచ్చాడు ఫ్రాసెస్ టోఫిక్.. 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన సెరీనా విలియమ్స్, తన 40 ఏళ్ల వయసులో టెన్నిస్ నుంచి తప్పుకుంది.. 

Latest Videos

click me!