రెండు ఒలింపిక్ పతకాల విజేత, భారత బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు, పాజిటివ్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని 2024 డిసెంబర్ 22న వివాహం చేసుకుంది. మూడు ముళ్ల బంధంతో ఈ జంట కొత్త ప్రయాణం మొదలు పెట్టింది. వీరిద్దరి బంధం ఒక విమాన ప్రయాణంలో తిరిగి కలుసుకున్న తర్వాత చిగురించింది.
సాయితో తన సంబంధం ఎలా ప్రారంభమైందో సింధు వెల్లడించింది. "ఒక విమాన ప్రయాణంలో తిరిగి కలుసుకోవడం నక్షత్రాలు కలిసినట్లు అనిపించింది" అని ఆమె వెల్లడించింది. "ఇది దాదాపుగా తొలి చూపులోనే ప్రేమ, ఆ క్షణం నుండి, ప్రతిదీ సరిగ్గా అనిపించిందన్నారు." కాలక్రమేణా వారి బంధం బలపడి, వారి జీవితాల్లో ఈ విలువైన మైలురాయికి దారితీసింది. మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
వారి నిశ్చితార్థం ఎందుకు రహస్యంగా ఉంచారనే విషయాన్ని కూడా సింధు వివరించింది. "మాకు దగ్గరగా ఉన్నవారు మాత్రమే హాజరయ్యారు" అని ఆమె చెప్పింది. "మేము గొప్పలకు పోకుండా అర్థవంతమైన క్షణాలను సృష్టించడంపై దృష్టి సారించాము, నిజంగా ముఖ్యమైన వ్యక్తులతో ఈ అద్భుతమైన క్షణాలను జరుపుకున్నాము. ఇది ఎంతో భావోద్వేగపూరితంగా.. మరపురానిదిగా ఉందని" తెలిపారు.
ఒక అథ్లెట్‌గా తన బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, సింధు తన పెళ్లిని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసింది. ప్రతి వివరాలను దగ్గరుండి తెలుసుకున్నారని సమాచారం. దీనిని వెంకట దత్తసాయి కార్యరూపంలోకి తీసుకువచ్చి.. సింధు గొప్ప వివాహ వేడుక కలలు నెరవేరేలా చూసుకున్నాడు. వారి వ్యక్తిత్వాలు, ప్రయాణాన్ని ప్రతిబింబించే వేడుకను వారు కలిసి సృష్టించారు, వారి ప్రత్యేక క్షణాలను విలువైన జ్ఞాపకంగా మార్చారు.
పెళ్లైన రెండు రోజుల తర్వాత, సింధు సోషల్ మీడియాలో తన మొదటి స్పందనను పంచుకుంది. వేడుక నుండి అందమైన ఫోటోలను 'హార్ట్' ఎమోజితో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ఆనందం, ప్రేమను ప్రసరింపజేసిందని చెప్పాలి.