Pro Kabaddi League 2023: అహ్మదాబాద్‌లో తెలుగు టైటాన్స్-గుజరాత్ జెయింట్స్ మ్యాచ్ తో ప్రొ కబడ్డీ లీగ్ 2023-24 పదో సీజన్ శనివారం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
2014లో ప్రారంభమైన ప్రొ కబడ్డీ లీగ్ ఇప్పటిదాకా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది. శనివారం నుంచి ప్రొ కబడ్డీ లీడ్ 10 సీజన్ ప్రారంభం కానుంద. ఈ టోర్నీలో లీగ్ దశలో మొత్తం 132 మ్యాచ్‌లు జరగనున్నాయి.
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 2023-24 పదో సీజన్ అహ్మదాబాద్‌లోని ట్రాన్స్‌స్టేడియా స్టేడియంలోని ఎరీనాలో శనివారం టోర్నీ ప్రారంభ కానుంది. ప్రారంభ గేమ్‌లో బ్లాక్‌బస్టర్ క్లాష్‌లో తెలుగు టైటాన్స్‌తో గుజరాత్ జెయింట్స్ తలపడనుంది.
ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచులు మొత్తం 12 నగరాల్లో జరగనున్నాయి. లీగ్ దశ ఫిబ్రవరి 21న ముగుస్తుంది. నాకౌట్ దశకు సంబంధించిన షెడ్యూల్‌ను నిర్వాహకులు ఇంకా ప్రకటించలేదు. పోటీలు జరిగే నగరాల్లో అహ్మదాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై, నోయిడా, ముంబయి, జైపూర్, హైదరాబాద్, పాట్నా, ఢిల్లీ, కోల్ కతా, పంచకులలు ఉన్నాయి.
కబడ్డీ లీగ్ (పీకేఎల్) 2023-24 పదో సీజన్ లో మొత్తం 12 జట్లు పాలుపంచుకుంటున్నాయి. ఈ సిరీస్ లో బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబాంగ్ ఢిల్లీ కేసీ, గుజరాత్ జెయింట్స్, హర్యానా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పాట్నా పైరేట్స్, పుణెరి పల్టన్, తమిళ్ తలైవాస్, తెలుగు టైటాన్స్, యూ ముంబా, యూపీ యోధాస్ జట్టు పాల్గొంటాయి.
తొలి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ జెయింట్స్ vs తెలుగు టైటాన్స్ మధ్య జరగనుంది. అలాగే, యూ ముంబా vs యూపీ యోధాస్ మధ్య మ్యాచ్ జరగనుంది.