పారాలింపిక్స్‌లో భారత్ తరుపున స్వర్ణం సాధించిన మొట్టమొదటి మహిళా అథ్లెట్‌గా రికార్డు క్రియేట్ చేసిన అవనీ లేఖరా... 2012లో కారు ప్రమాదానికి గురైంది...
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అవనీ లేఖరా... వెన్నుముక విరగడంతో వీల్‌ఛైర్‌కే పరిమితమైంది. ఎటూ కదలలేని స్థితిలో, ఓ చీకటి గదిలో ఉంటూ తీవ్ర డిప్రెషన్‌కి గురైన అవనీ లేఖరాకి మళ్లీ జీవితంపై ఆసక్తి పుట్టించడానికి క్రీడలను ఎంచుకున్నారు ఆమె తండ్రి...
అంతకుముందు స్పోర్ట్స్ అంటే పెద్దగా ఆసక్తి చూపించని అవనీ, షూటింగ్‌పై మక్కువ పెంచుకుంది. అయితే ప్రారంభంలో షూటింగ్‌కి కేవలం కాలక్షేపానికి మాత్రమే టైం కేటాయించేది.
అయితే ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత షూటర్ అభినవ్ బింద్రా ఆటోబయోగ్రఫీ చదివిన తర్వాత ఆమె షూటింగ్‌ని సీరియస్‌గా తీసుకుంది...
అప్పటినుంచి ఆమె ప్రయాణం టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించేదాకా దిగ్విజయంగా సాగింది. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ ఎస్‌హెచ్1 ఈవెంట్‌లో 249.6 పాయింట్లు సాధించిన అవనీ, పారాలింపిక్స్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.