T20 World Cup 2026 Final: అహ్మదాబాద్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనుంది. టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌కు ముందు పాకిస్థాన్ మాజీ ప్లేయర్ షోయబ్ అక్తర్ 2023 ప్రపంచకప్ ఓటమిని గుర్తు చేస్తూ టీమ్ ఇండియాపై ఒత్తిడి పెంచే వ్యాఖ్యలు చేశారు.
ఇండియా vs న్యూజిలాండ్ ఫైనల్: అక్తర్ షాకింగ్ కామెంట్స్ వైరల్
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. అయితే, ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ టీమ్ ఇండియా పాత గాయాలను మళ్లీ గుర్తు చేశారు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఇదే మైదానంలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఎదుర్కొన్న ఘోర పరాజయాన్ని ప్రస్తావిస్తూ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
26
భారత్ పై 150 కోట్ల మంది ఒత్తిడి
ట్యాప్‌మాడ్ షో గేమ్ ఆన్ హై లో అక్తర్ మాట్లాడుతూ.. భారత్‌పై భారీ అంచనాల భారం ఉంటుందని పేర్కొన్నారు. "భారత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది, కానీ వారిపై 150 కోట్ల మంది ప్రజల ఆశల ఒత్తిడి ఉంది. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో అహ్మదాబాద్‌లోనే ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిన విషయాన్ని మర్చిపోకూడదు. ఆ ఓటమి జ్ఞాపకాలు, ప్రేక్షకుల అంచనాలు భారత ఆటగాళ్లపై మానసిక ఒత్తిడిని పెంచుతాయి" అని అక్తర్ అన్నారు.
36
IND vs NZ : పిచ్ పరిస్థితి ఏంటి? స్కోరు అంచనాలు ఇవే
అహ్మదాబాద్ పిచ్ స్వభావాన్ని బట్టి మ్యాచ్ ఫలితం మారుతుందని అక్తర్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ వికెట్ స్పిన్నర్లకు అనుకూలిస్తే, 175 నుండి 200 పరుగుల స్కోరు సవాల్‌గా మారుతుందని ఆయన అన్నారు. "న్యూజిలాండ్ గనుక మొదట బ్యాటింగ్ చేసి 225 లేదా 250 పరుగులు చేస్తే, భారత్ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. టీమ్ ఇండియా సర్వసన్నద్ధంగా వస్తుందని నాకు తెలుసు, కానీ క్రికెట్ శ్రేయస్సు దృష్ట్యా న్యూజిలాండ్ ఈసారి టైటిల్ గెలవాలని నేను కోరుకుంటున్నాను" అని అక్తర్ తన మనసులోని మాటను బయటపెట్టారు.
మరో పాక్ మాజీ బౌలర్ ఉమర్ గుల్ కూడా అక్తర్ వ్యాఖ్యలతో ఏకీభవించారు. కివీస్ జట్టుకు భారత్‌లో ఆడిన అనుభవం మెండుగా ఉందని ఆయన గుర్తు చేశారు. "న్యూజిలాండ్ బౌలింగ్ విభాగం చాలా బలంగా కనిపిస్తోంది. ఇటీవల వారు భారత్‌లో టెస్ట్ సిరీస్ గెలిచి ఉండటం వారికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇక్కడి స్పిన్ ట్రాక్‌లపై వారికి అవగాహన ఉంది. భారత్ భారీ జనాభా కలిగిన దేశం కాబట్టి, ఆ ఒత్తిడి మైదానంలో ఆటగాళ్లపై ప్రభావం చూపుతుంది" అని గుల్ పేర్కొన్నారు.
56
గ్లెన్ ఫిలిప్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూజిలాండ్ ఆల్ రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ కూడా ఫైనల్ ముందు స్పందించారు. భారత ప్రతిభను ఆయన ప్రశంసించారు. "భారత్ దగ్గర అపారమైన టాలెంట్ ఉంది, వారు ఒకేసారి రెండు మూడు బలమైన జట్లను తయారు చేయగలరు. మా దేశ జనాభా తక్కువ కాబట్టి మాకు పరిమితమైన వనరులే ఉన్నాయి. కానీ మేము కలిసికట్టుగా పోరాడి విజయం సాధిస్తాం" అని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత టోర్నీలో భారత్ ఎదుర్కొన్న ఏకైక ఓటమి కూడా ఇదే అహ్మదాబాద్ స్టేడియంలో దక్షిణాఫ్రికాపై రావడం గమనార్హం.
66
సూర్యకుమార్ సేన చరిత్ర సృష్టిస్తుందా?
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది. గత ఏడాది కాలంగా టీమ్ ఇండియా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అయితే, అక్తర్, గుల్ చెప్పినట్లుగా 150 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను మోస్తూ, పాత గాయాలను అధిగమించి భారత్ విశ్వవిజేతగా నిలుస్తుందా? లేక న్యూజిలాండ్ మొదటిసారి టీ20 ప్రపంచకప్ నెగ్గి చరిత్ర సృష్టిస్తుందా? అనేది ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌తో తేలిపోనుంది.