తెలుగమ్మాయికి అరుదైన గౌరవం... ఆరంభ వేడుకల్లో పీవీ సింధు, ముగింపు వేడుకల్లో జరీన్...

First Published | Aug 8, 2022, 4:08 PM IST

బర్మింగ్‌హమ్ వేదికగా జరిగిన 22వ కామన్వెల్త్ గేమ్స్ ముగింపు దశకు చేరుకున్నాయి. 11 రోజుల పాటు క్రీడాభిమానులను అలరించిన కామన్వెల్త్ గేమ్స్ కారణంగా ఎందరో యువ క్రీడాకారులు ప్రపంచానికి పరిచయమయ్యారు. రికార్డు స్థాయిలో ఈసారి 56 మంది భారత అథ్లెట్లు, మొట్టమొదటి కామన్వెల్త్ గేమ్స్‌లోనే పతకాలు సాధించారు...

కామన్వెల్త్ గేమ్స్‌లో ఎప్పుడూ లేని విధంగా లాన్‌ బౌల్స్ ఈవెంట్‌లో రెండు పతకాలు సాధించిన భారత జట్టు, ఫీల్డ్ అండ్ ట్రాక్ ఈవెంట్లలోనూ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి మొట్టమొదటి నాలుగు పతకాలు సాధించింది.. 

Priyanka Goswami

3 వేల మీటర్ల స్టీపుల్‌ఛేజ్ ఈవెంట్‌లో అవినాష్ రజతం గెలవగా, 10కి.మీ.ల మహిళల రేస్ వాక్‌లో ప్రియాంక గోస్వామి రజతం, పురుషుల 10000 మీటర్ల రేస్‌ వాక్ ఫైనల్స్‌లో భారత అథ్లెట్ సందీప్ కుమార్ కాంస్యం గెలిచారు...

Latest Videos


హై జంప్‌లో తేజస్విన్ యాదవ్ కాంస్యం, లాంగ్‌ జంప్‌లో మురళీ శ్రీశంకర్ రజతం గెలవగా, త్రిబుల్ జంప్‌లో ఎల్డ్‌హోస్ పాల్, అబ్దుల్లా అబూబకర్ మొదటి రెండు స్థానాల్లో నిలిచి స్వర్ణం, రజతం గెలిచారు...

కామన్వెల్త్ గేమ్స్ ఆరంభ వేడుకల్లో భారత త్రివర్ణ పతకాన్ని చేపట్టి ముందు నడిచారు పీవీ సింధు, పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్. పీవీ సింధు వుమెన్స్ సింగిల్స్‌లో స్వర్ణం సాధించగా, పురుషుల హాకీ జట్టు ఫైనల్ చేరింది...

కామన్వెల్త్ గేమ్స్ ముగింపు వేడుకల్లో భారత త్రివర్ణ పతకాన్ని చూబూనే అవకాశం కూడా తెలుగు అమ్మాయికే దక్కింది. బాక్సింగ్‌లో స్వర్ణం నెగ్గిన భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్, భారత టేబుల్ టెన్నిస్ లెజెండ్ శరత్ కమల్ కలిసి ముగింపు వేడుకల్లో భారత త్రివర్ణ పతకాన్ని చేబట్టి, ముందు నడవబోతున్నారు...

టేబుల్ టెన్నిస్ టీమ్‌ని నడిపిస్తున్న 40 ఏళ్ల శరత్ కమల్, మెన్స్ టీమ్ ఈవెంట్‌లో, మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచాడు. మెన్స్ డబుల్స్‌లో రజతం గెలిచిన శరత్ కమల్, ఆఖరి రోజున మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాడు...

click me!