Mumbai Indians: ఈ ఐపీఎల్ సీజన్ లో సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా తిలక్ వర్మ రికార్డు సృష్టించాడు. తన తొలి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్న తిలక్, రాబోయే మ్యాచుల్లో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2026లో వరుస ఓటములతో కుంగిపోయిన ముంబై ఇండియన్స్ జట్టును తెలుగోడు తిలక్ వర్మ తన అద్భుత సెంచరీతో గండం గట్టెక్కించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక పోరులో అజేయ శతకంతో చెలరేగి ముంబైకి రెండో విజయాన్ని అందించాడు. ఈ అద్భుత ప్రదర్శన తర్వాత తిలక్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.
25
సంక్షోభంలో ఆపద్బాంధవుడు
ముంబై ఇండియన్స్ 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు. రోహిత్ శర్మ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా, మిగిలిన స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట తిలక్ రారాజులా నిలబడ్డాడు. అనవసరమైన షాట్లకు పోకుండా, పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేస్తూ గుజరాత్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. సిరాజ్, రబడా, రషీద్ ఖాన్ వంటి మేటి బౌలర్ల బంతులను గౌరవిస్తూనే, గతి తప్పిన బంతులను బౌండరీలకు తరలించాడు.
35
రికార్డు స్థాయి బ్యాటింగ్
కేవలం 45 బంతుల్లోనే తిలక్ వర్మ తన తొలి ఐపీఎల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇందులో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ముంబై స్కోరును 199 పరుగులకు చేర్చాడు. నమన్ ధీర్‌తో కలిసి 52 పరుగులు, హార్దిక్ పాండ్యాతో 81 పరుగుల కీలక భాగస్వామ్యాలను నెలకొల్పి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఈ లక్ష్యాన్ని ఛేదించలేక గుజరాత్ టైటాన్స్ ముంబై బౌలర్ల ముందు తలవంచింది.
మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ మాట్లాడుతూ.. "ఈ విజయం మా జట్టుకు చాలా అవసరం. వరుసగా నాలుగు ఓటముల తర్వాత గెలవడం ఆనందంగా ఉంది. తొలి 20 బంతుల్లో నేను నెమ్మదిగా ఆడాను, కేవలం బంతిని గమనిస్తూ పిచ్‌పై కుదురుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చాను. ఒత్తిడిలో ఉన్నప్పుడు మన ప్రాథమిక నైపుణ్యాలను(బేసిక్స్) నమ్ముకోవడమే ముఖ్యమని ఈ రోజు నిరూపితమైంది. నమన్ ధీర్ ఇన్నింగ్స్ కూడా మాకు చాలా ప్లస్ అయ్యింది" అని చెప్పుకొచ్చాడు.
55
మూడో ఆటగాడిగా తిలక్ రికార్డు
ఈ ఐపీఎల్ సీజన్ లో సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా తిలక్ వర్మ రికార్డు సృష్టించాడు. తన తొలి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్న తిలక్, రాబోయే మ్యాచుల్లో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తిలక్ వర్మ ఇలాగే రాణించడం జట్టుకు ఎంతో ముఖ్యం.