'రోహిత్, కోహ్లీ కాదు.. గంభీర్ రంజీ టెస్టుకు కోచింగ్ ఇవ్వాలి..'

Published : Dec 31, 2025, 01:51 PM IST

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయి. జట్టులో ప్రయోగాలు శ్రుతిమించాయని, రెడ్ బాల్ క్రికెట్‌ను అర్థం చేసుకోవడంలో గంభీర్ విఫలమయ్యాడని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అన్నాడు.  

PREV
15
గంభీర్ పై ఇంకా విమర్శలు..

భారత జట్టుకు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జట్టులో ప్రయోగాలు శ్రుతిమించాయన్న విమర్శ ఇంకా కొనసాగుతున్నాయి. స్వదేశంలోనూ, విదేశాలలోనూ ఈ విమర్శల పరంపర ఇంకా పెరుగుతూపోతోంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్ కలిసి టీమిండియాను 'క్రికెట్ ల్యాబ్'గా మార్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

25
గంభీర్ పై కీలక వ్యాఖ్యలు..

ఈ క్రమంలో గంభీర్‌పై సీనియర్ ప్లేయర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ మాట్లాడుతూ, 'గౌతమ్ గంభీర్ ఇప్పటివరకు చేసింది చాలు. ఇక నుంచి రంజీ ట్రోఫీకి కోచ్‌గా వ్యవహరిస్తే బాగుంటుంది. రెడ్ బాల్ క్రికెట్ గురించి తెలుసుకోవాలంటే రంజీ చాలా ఉపయోగపడుతుంది' అని సలహా ఇచ్చాడు.

35
అక్కడ విజయం.. ఇక్కడ ఫెయిల్..

గంభీర్ వైట్ బాల్ క్రికెట్‌లో విజయవంతమయ్యాడు కానీ, రెడ్ బాల్ క్రికెట్‌ను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడని అతడు పేర్కొన్నాడు. అందుకోసం రంజీ కోచ్‌గా చేస్తే, అక్కడ ఇతర కోచ్‌లతో కలిసి జట్టు కూర్పు ఎలా చేయాలో నేర్చుకోవచ్చని పనేసర్ అభిప్రాయపడ్డాడు.

45
గిల్ పై కూడా కీలక వ్యాఖ్యలు..

కెప్టెన్ గిల్‌పై కూడా మాంటీ పనేసర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్ టాలెంటెడ్ ప్లేయర్ అయినప్పటికీ, అన్ని ఫార్మాట్‌లను లీడ్ చేసేంత సమర్థుడు కాదని అతడు అన్నాడు. కోచ్ గంభీర్ ఆధ్వర్యంలో, గిల్ కెప్టెన్సీలో టెస్ట్ క్రికెట్‌లో ఇండియా రెండు వైట్‌వాష్‌లను మూటగట్టుకుంది.

55
ఈ సిరీస్ లు ఓడిపోయింది..

న్యూజిలాండ్‌పై 3-0, సౌత్ ఆఫ్రికాతో 2-0 తేడాతో రెండు వైట్‌వాష్‌లను టీమిండియా గురికావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితులలో గంభీర్ రంజీ కోచ్‌గా వ్యవహరించడం ఉత్తమమని పనేసర్ కామెంట్ చేయడం విస్తృత చర్చకు దారితీసింది. పనేసర్ చేసిన ఈ కామెంట్స్‌ను భారత క్రికెట్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో సమర్థిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories