అయ్యర్‌కు గుడ్‌బై..! కేకేఆర్ రిటైన్ లిస్టు ఇదిగో.. టీ20 తోపులకే పెద్ద పీట..

Published : Nov 13, 2025, 07:28 PM IST

KKR: కోల్‌కతా నైట్ రైడర్స్ తమ రిటైన్, రిలీజ్ లిస్టులను సిద్దం చేసింది. టీ20 బడా ప్లేయర్స్‌కి పెద్ద పీట వేసినట్టు సమాచారం. మరి ఆ లిస్టు ఎలా ఉందంటే.? మరి ఆ లిస్టు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో చూసేద్దాం మరి. 

PREV
15
టూ-టైం ఛాంపియన్..

ఐపీఎల్‌లో టూ-టైం ఛాంపియన్‌గా నిలిచింది కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు. గంభీర్ కెప్టెన్సీలో ఒకసారి.. ఆయన కోచ్‌గా ఉన్నప్పుడు మరోసారి ఐపీఎల్ ట్రోఫీని సాధించింది. బలమైన కోర్ టీం జట్టు సొంతం. మరి వాళ్ల రిలీజ్, రిటైన్ లిస్టు ఎలాగుందంటే.!

25
కొత్త కోచ్, కొత్త కెప్టెన్..

గంభీర్.. టీమిండియాకి కోచ్ అవ్వడం.. శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ కెప్టెన్ కావడంతో ఈసారి కేకేఆర్ జట్టు కొత్త కెప్టెన్, కొత్త కోచ్‌తో బరిలోకి దిగబోతోంది. ఇప్పటికే అభిషేక్ నాయర్‌ను కోచ్‌గా నియమించగా.. కెప్టెన్ వేటలో ఉంది యాజమాన్యం. అటు షేన్ వాట్సన్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది.

35
కోర్ టీం అంతా టీ20 స్పెషలిస్టులే..

కేకేఆర్ టీం మొత్తం టీ20 స్పెషలిస్టులే అని చెప్పొచ్చు. ముఖ్యంగా జట్టులో రింకూ సింగ్, సునీల్ నరైన్, రస్సెల్, రహనే, రఘువంశీ వంటి ప్లేయర్స్ ఉన్నారు. అటు వీరే ఈ సీజన్‌లోనూ కీలకం కానున్నారు. అయితే అత్యధిక మొత్తంలో కొన్న ఓ ఆటగాడిని మాత్రం విడుదల చేయనుంది కేకేఆర్.

45
రిటైన్, రిలీజ్ లిస్టు ఇదిగో..

అజింక్య రహనే, రహమనుల్లా గుర్బజ్, అంక్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, లువ్నిత్ సిసోడియా, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, మయాంక్ మార్కండే, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, మనీష్ పాండే రిలీజ్ లిస్టులో ఉండగా.. రోవమన్ పావెల్, మొయిన్ అలీ, వెంకటేష్ అయ్యర్, నోకియా, స్పెన్సర్ జాన్సన్, చేతన్ సకరియా, శివమ్ శుక్లా, డికాక్ రిలీజ్ లిస్టులో ఉన్నారు.

55
పేలవ ప్రదర్శన..

గత సీజన్‌లో కేకేఆర్ అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచింది. ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం ఐదు మ్యాచ్‌లలో మాత్రమే గెలిచి.. ఏడింట ఓడిపోయి.. రెండు డ్రా చేసుకుని.. 12 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈసారి కచ్చితంగా ప్లేఆఫ్స్ చేరాలని కేకేఆర్ ధృడ నిశ్చయంతో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories