ఖో ఖో వరల్డ్ కప్ 2025: భారత ప‌రుషుల‌, మ‌హిళ‌ల ఖోఖో జ‌ట్ల‌లో ఎవ‌రెవ‌రున్నారంటే?

First Published | Jan 10, 2025, 6:47 PM IST

Kho Kho World Cup 2025: జనవరి 13 నుంచి ప్రారంభం కానున్న తొలి ఖోఖో ప్రపంచకప్ 2025 కోసం భారత్ తమ జట్లను ప్రకటించింది. భారత పురుషుల జట్టుకు ప్రతీక్ వైకర్, మహిళల జట్టుకు ప్రియాంక ఇంగ్లే నాయకత్వం వహించనున్నారు.

Kho Kho World Cup 2025: జనవరి 13 నుంచి 19 వరకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఖోఖో వరల్డ్ కప్ 2025 ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్ఐ), అంతర్జాతీయ ఖోఖో ఫెడరేషన్ (ఐకేకేఎఫ్) గురువారం తుది భారత పురుషుల, మహిళల జట్లను ప్రకటించాయి. ఈ మెగా ఈవెంట్ మొదటి ఎడిషన్ లో 20 పురుషుల జట్లు, 19 మహిళా జట్లు పాల్గొంటాయి. టోర్నమెంట్ కోసం మొత్తం 23 దేశాలు పోటీకి సిద్ధంగా ఉన్నాయి.

Kho Kho

ఖో ఖో భారత పురుషుల జట్టు కెప్టెన్‌గా ప్రతీక్ వైకర్ 

ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్ఐ) భారత జట్టును ప్రకటించింది. భారత పురుషుల ఖోఖో జట్టుకు ప్రతీక్ వైకర్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. జనవరి 13న ప్రారంభం కానున్న తొలి ఖో ఖో ప్రపంచకప్‌కు ఆతిథ్య భారత జట్టు తమ జట్టును ప్రకటించడంతో ప్రియాంక ఇంగ్లే మహిళల జట్టుకు నాయకత్వం వహిస్తుంది.

ఖోఖో టోర్నమెంట్ జనవరి 13 నుంచి 19 వరకు ఇందిరాగాంధీ స్టేడియంలో జరగనుంది. తొలిరోజు భారత పురుషుల జట్టు నేపాల్‌తో పోటీపడగా, జనవరి 14న మహిళల జట్టు దక్షిణ కొరియాతో తలపడనుంది. కెప్టెన్లకు మద్దతుగా, సుమిత్ భాటియా మహిళల జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. అశ్వనీ కుమార్ ప్రధాన కోచ్‌గా పురుషుల జట్టుకు మార్గనిర్దేశం చేయనున్నారు.


Kho Kho

ఖో ఖో భారత పురుషుల జట్టులో ఎవరెవరున్నారు? 

ప్రతీక్ వైకర్ (కెప్టెన్), ప్రబాని సబర్, మెహుల్, సచిన్ భార్గో, సుయాష్ గార్గేట్, రామ్‌జీ కశ్యప్, శివ పోతిర్ రెడ్డి, ఆదిత్య గన్‌పూలే, గౌతమ్ ఎంకే, నిఖిల్ బి, ఆకాష్ కుమార్, సుబ్రమణి వి, సుమన్ బర్మన్, అనికేత్ పోటే, ఎస్. రోకేసన్ సింగ్

స్టాండ్‌బై: అక్షయ్ బంగారే, రాజవర్ధన్ శంకర్ పాటిల్, విశ్వనాథ్ జానకిరామ్.

ఖో ఖో భారత మహిళల జట్టులో ఎవరెవరున్నారు? 

ప్రియాంక ఇంగ్లే (కెప్టెన్), అశ్విని షిండే, రేష్మా రాథోడ్, భిలార్ దేవ్‌జీభాయ్, నిర్మలా భాటి, నీతా దేవి, చైత్ర ఆర్, శుభశ్రీ సింగ్, మగాయ్ మాఝీ, అన్షు కుమారి, వైష్ణవి బజరంగ్, నస్రీన్ షేక్, మీను, మోనికా, నజియా బీ

స్టాండ్‌బై: సంపద మోర్, రితికా సిలోరియా, ప్రియాంక భోపి.

Kho Kho mumbai

ఇది మొదటి ప్రపంచ కప్.. మహిళా జట్టు కెప్టెన్ ప్రియాంక

"ఇది మొదటి ప్రపంచ కప్... నేను మహిళల జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాను. ఇది నిజంగా గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. రాబోయే సంవత్సరాల్లో ఖో ఖో మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మరింది గుర్తింపు పొందుతుంది. జూనియర్లు ఆడే అవకాశాలు లభిస్తాయి కాబట్టి వారు కష్టపడి సాధన చేయాలి. ఆసియా లేదా కామన్వెల్త్ క్రీడల్లో లేదా ఒలింపిక్స్‌లో కూడా రావాలి" అని ప్రియాంక చెప్పినట్టు పీటీఐ నివేదికలు పేర్కొన్నాయి.

అలాగే, ఖో ఖో భారత పురుషుల జట్టు కెప్టెన్ ప్రతీక్ వైకర్ మాట్లాడుతూ..  "నేను గత 24 సంవత్సరాలుగా ఖో ఖో ఆడుతున్నాను, చివరకు నా జట్టుకు నేనే కెప్టెన్‌గా వ్యవహరించే రోజు వచ్చింది. నా పేరు ప్రకటించిన క్షణంలో నేను గూస్‌బంప్స్‌కి గురయ్యాను. ఎట్టకేలకు నా కష్టానికి ఫలితం దక్కిందని నా కుటుంబం గర్వపడుతుందని" చెప్పాడు.

Kho Kho World Cup

భారత జట్టును 'భారత్ కీ టీమ్'గా పిలుస్తాం.. : ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్

ఖో ఖో ప్రపంచకప్ సీఈఓ మేజర్ జనరల్ విక్రమ్ దేవ్ డోగ్రాతో పాటు ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ క‌లిసి భార‌త పురుషుల‌, మ‌హిళ‌ల ఖోఖో జ‌ట్ల‌ను ప్ర‌క‌టించారు. మిట్టల్ జట్ల జెర్సీల ప్రత్యేక ఫీచర్‌ను కూడా ఆవిష్కరించారు. పురుషుల, మహిళల స్క్వాడ్‌లు రెండూ "భారత్" లోగోను కలిగి ఉంటాయి. వాటిని "భారత్ కీ టీమ్" అని సగర్వంగా బ్రాండ్ చేస్తుంద‌ని తెలిపారు. 

భారత జట్టును 'భారత్ కీ టీమ్'గా పిలుస్తామని మిట్టల్ మీడియా సమావేశంలో అన్నారు. "జెర్సీలో 'భారత్' ప్రముఖంగా ఉంటుంది" అని తెలిపారు. మహిళల ఎడిషన్ విజేతకు సంబంధించిన ట్రోఫీని గురువారం ఆవిష్కరించారు. "తమ నైపుణ్యాలను ప్రదర్శించే మహిళలను గ్రీన్ ట్రోఫీ సత్కరిస్తుంది" అని ఖో ఖో ప్రపంచకప్ సిఓఓ గీతా సుధన్ అన్నారు. టోర్నమెంట్‌కు సన్నాహకంగా, న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో శిక్షణా శిబిరం జరిగింది.

Latest Videos

click me!