ఖో ఖో ప్రపంచ కప్ 2025: టాప్ గేర్.. సెమీస్‌లో భారత మహిళల జట్టు

Published : Jan 17, 2025, 11:08 PM IST

Kho Kho World Cup 2025: ఖో ఖో ప్రపంచ కప్ 2025 లో భారత జట్టు టాప్ గేర్ లో ముందుకు సాగుతోంది. ఇప్పుడు సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత మహిళల జట్టు తలపడనుంది.

PREV
15
ఖో ఖో ప్రపంచ కప్ 2025: టాప్ గేర్.. సెమీస్‌లో భారత మహిళల జట్టు
Image Credits: Twitter/All India Radio News

ఖోఖో ప్ర‌పంచ క‌ప్ 2025 లో భార‌త జ‌ట్టు దుమ్మురేపుతోంది. పురుషుల జ‌ట్టుతో పాటు మ‌హిళ‌ల జ‌ట్టు కూడా టాప్ గేర్ లో ముందుకు సాగుతోంది. అద్భుత‌మైన ఆట‌తో ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు షాకిస్తూ ఇప్ప‌టికు ఒక్క ఓట‌మి కూడా లేకుండా భార‌త మ‌హిళ ఖోఖో జ‌ట్టు తన జైత్రయాత్ర‌ను కొన‌సాగిస్తోంది.

జనవరి 17, శుక్రవారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భార‌త మ‌హిళ జ‌ట్టు సూప‌ర్ విక్ట‌రీ అందుకుంది. ఈ విజ‌యంతో టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు సెమీఫైనల్‌కు తమ స్థానాన్ని బుక్ చేసుకుంది.

25
Image Credits: Twitter/Kho Kho World Cup 2025

ఖోఖో ప్రపంచ కప్ 2025 లో భారత్ దెబ్బకు బంగ్లాదేశ్ చిత్తు 

 

ఖో ఖో ప్రపంచ కప్ 2025 టైటిల్ కోసం పోరాడుతున్న భారత మహిళల జట్టు శుక్రవారం, జనవరి 17న న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్ దశలో దక్షిణాఫ్రికా, ఇరాన్, మలేషియాపై విజయాలు సాధించి అజేయంగా క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది.

క్వార్టర్ ఫైనల్లో మరో అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టు అంచనాలను అందుకుంది. టాస్ గెలిచిన భారత మహిళల జట్టు మొదటి టర్న్‌లో దాడికి దిగింది. బంగ్లాదేశ్ బలహీనమైన డిపెండింగ్ భారత అటాకర్లకు అనుకూలంగా మారింది. భారత జట్టు వేగవంతమైన డాడ్జెస్, డైవ్‌లు, వ్యూహాత్మక సమన్వయం బంగ్లాదేశ్‌పై ఒత్తిడి తెచ్చింది. మొదటి టర్న్ చివరిలో ప్రియాంక ఇంగ్లే నేతృత్వంలోని భారత జట్టు 50 పాయింట్లు సాధించింది.

35

బంగ్లాదేశ్ కు ఎక్కడా ఛాన్స్ ఇవ్వని టీమిండియా

 

రెండవ టర్న్‌లో, బంగ్లాదేశ్ అటాక్ పూర్తిగా తేలిపోయింది. భారత డిఫెండింగ్ ను అధిగమించడంలో బంగ్లాదేశ్ అటాకర్లు పూర్తిగా విఫలమయ్యారు. బంగ్లాదేశ్ మహిళల జట్టు కేవలం 8 పాయింట్లు మాత్రమే సాధించగా, భారత జట్టు తమ రక్షణకు అదనంగా ఆరు పాయింట్లు సాధించింది. క్వార్టర్ ఫైనల్ రెండో సగం చివరిలో భారత జట్టు 56-8తో బంగ్లాదేశ్‌పై 48 పాయింట్ల ఆధిక్యంలో ఉంది.

మూడవ టర్న్‌లో రెండో సగం ప్రారంభంలో, భారత జట్టు తమ దాడిని కొనసాగించింది. మూడవ టర్న్ చివరిలో భారత జట్టు మొత్తం 104 పాయింట్లకు చేరుకుంది. నాల్గవ టర్న్‌లో బంగ్లాదేశ్ మళ్ళీ దాడికి దిగింది, కానీ భారత జట్టుపై ఒత్తిడి తేలేకపోయింది. బంగ్లాదేశ్ మొత్తం 14 పాయింట్లకు చేరుకుంది, భారత మహిళల జట్టు తమ రక్షణకు అదనంగా ఆరు పాయింట్లు గెలుచుకుంది.

45
Image Credit: Twitter/All India Radio News

ఖోఖో ప్రపంచ కప్ 2025 లో సెమీ ఫైనల్ కు భారత మహిళల జట్టు

 

 

రెండో సగం చివరిలో, భారత జట్టు 109-14తో బంగ్లాదేశ్‌పై 95 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. ఈ గెలుపుతో టోర్నమెంట్‌లో వరుసగా నాల్గవ మ్యాచ్‌లో ప్రియాంక ఇంగిల్ నేతృత్వంలోని జట్టు 100 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించింది. బంగ్లాదేశ్‌పై క్వార్టర్ ఫైనల్ విజయంతో భారత మహిళల జట్టు మరోసారి ఖో ఖో ప్రపంచ కప్ 2025లో అత్యంత బలమైన జట్టుగా నిలిచింది.

ఇంతకుముందు, ఉగాండా, నేపాల్, దక్షిణాఫ్రికా ఈ చారిత్రాత్మక ఈవెంట్ సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. ఖో ఖో ప్రపంచ కప్ 2025లో భారత్, దక్షిణాఫ్రికా మాత్రమే అజేయంగా ఉన్న జట్లు. 

 

55
Image Credit: Twitter/G Krishnan

ఖోఖో ప్రపంచ కప్ 2025 లో టీమిండియా మహిళల జైత్రయాత్ర

 

ఖోఖో ప్రపంచ కప్ 2025 లో భారత మహిళల జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వరుస విజయాలతో ఇప్పుడు టైటిల్ ను అందుకోవడానికి మరో రెండు అడుగుల దూరంలో ఉంది. ప్రియాంక ఇంగ్లే కెప్టెన్సీలోని భారత జట్టు తొలి ప్రపంచ కప్ 2025 టైటిల్ ను గెలుచుకుంటుందని అంచనాలకు తగ్గట్టుగా అద్భుతమైన ఆటతో ముందుకు సాగుతోంది.

చారిత్రాత్మక టైటిల్ కోసం పోరాడుతున్న భారత మహిళల జట్టు శనివారం, జనవరి 18న న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగే సెమీఫైనల్లో అజేయంగా ఉన్న దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

click me!

Recommended Stories