ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపు దశకు చేరుకుంది. ఈ తరుణంలో 2027 ఐపీఎల్ వేలానికి ముందే కొన్ని జట్లు తమ స్టార్ ఆటగాళ్లను వదిలించుకునే అవకాశం ఉంది. ఆ జాబితాలో ఉన్న ఐదుగురు ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) సీజన్ లీగ్ దశ ముగింపుకు చేరుకుంది. ఈ తరుణంలో 2027 ఐపీఎల్ వేలానికి ముందే కొన్ని జట్లు తమ స్టార్ ఆటగాళ్లను వదిలించుకునే అవకాశం ఉంది. ఆ జాబితాలో ఉన్న ఐదుగురు ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
26
1. హార్దిక్ పాండ్యా
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. కెప్టెన్‌గా జట్టును పాతాళానికి తొక్కేశాడు. వ్యక్తిగతంగా కూడా 9 మ్యాచ్‌లలో కేవలం 172 పరుగులు చేసి, 4 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో ముంబై ఫ్రాంచైజీ అతనికి గేట్ పాస్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
36
2. మిచెల్ స్టార్క్
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో పదును కోల్పోయాడు... ఇప్పటివరకు 5 మ్యాచులాడిన ఇతడు 9 వికెట్లు పడగొట్టాడు. స్టార్ బౌలర్ స్టార్క్ పైనే డిల్లీ భారీ ఆశలు పెట్టుకుంది... కానీ అతడు ఆ స్థాయిలో ఆడటంలేదు. దీంతో వచ్చే ఐపీఎల్ వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంచైజీ అతన్ని అట్టిపెట్టుకోవడం అనుమానమేనని తెలుస్తోంది.
వెటరన్ క్రికెటర్ ఇషాంత్ శర్మ కూడా వచ్చే ఐపీఎల్ టోర్నమెంట్‌లో కనిపించడం సందేహమే. ప్రస్తుతం ఈ సీనియర్ పేసర్ గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్నాడు. వయసు కారణంగా తుది జట్టులో ఇషాంత్‌కు చోటు దక్కడం లేదు. రాబోయే ఐపీఎల్‌కు ముందు ఇషాంత్‌కు గేట్‌పాస్ ఖాయమని అంటున్నారు.
56
4. ట్రెంట్ బౌల్ట్
కివీస్ ఎడమచేతి వాటం పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఈసారి ఐపీఎల్ టోర్నమెంట్‌లో తన మ్యాజిక్ చూపించడంలో విఫలమయ్యాడు. ఇతడు ఐదు మ్యాచులాడి కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.... భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అందువల్ల ముంబై ఫ్రాంచైజీ బౌల్ట్‌కు గేట్‌పాస్ ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
66
6. పృథ్వీ షా
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతిభావంతుడైన ఆటగాడు పృథ్వీ షాకు ఈ ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. రాబోయే ఐపీఎల్ వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంచైజీ పృథ్వీని జట్టు నుంచి విడుదల చేసే అవకాశం ఉంది.