డికాక్ రాకతో డేంజరస్‌గా ముంబై.. ప్లేయింగ్ ఎలెవన్ చూస్తే మతిపోతుంది

Published : Dec 17, 2025, 08:36 PM IST

IPL: ఐపీఎల్ మినీ వేలంలో ముంబై ఇండియన్స్ తెలివిగా వ్యవహరించిందని చెప్పొచ్చు. కేవలం రూ. 2.75 కోట్లతో బరిలోకి దిగి, తమకు కావాల్సిన కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. క్వింటన్ డికాక్‌ను కోటి రూపాయలకే కొని, బ్యాకప్ ఓపెనర్..

PREV
15
పక్కా వ్యూహంతో తక్కువ బడ్జెట్‌కే

ఐపీఎల్ 2026 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ తమ జట్టును బలోపేతం చేయడంలో పక్కా వ్యూహాన్ని ఆచరించింది. అబుదాబిలో జరిగిన మినీ వేలంలో, అత్యల్పంగా రూ. 2.75 కోట్ల బడ్జెట్‌తోనే బరిలోకి దిగినప్పటికీ, తమకు కావాల్సిన కీలక ఆటగాళ్లను చాకచక్యంగా కొనుగోలు చేసింది.

25
విధ్వంసకర ప్లేయర్ రూ. కోటికే

వేలంలో ముంబై ఇండియన్స్ ప్రధాన కొనుగోళ్లలో మాజీ ఆటగాడు క్వింటన్ డికాక్ తిరిగి జట్టులోకి రావడమే హైలైట్. అతన్ని కేవలం రూ. కోటి కనీస ధరకు కొనుగోలు చేయడం ద్వారా, జట్టుకు బ్యాకప్ ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా ఉన్న రెండు కీలక అవసరాలను తీర్చుకుంది. డికాక్‌తో పాటు, ముంబై ఇండియన్స్ పలువురు యువ ఆటగాళ్లను కూడా కొనుగోలు చేసింది. వారిలో డానిష్ మలేవార్, మహమ్మద్ ఇజార్, అధర్వ అంకోలేకర్, మయాంక్ రావత్ ఉన్నారు. ఈ నలుగురిని 30 లక్షల రూపాయల చొప్పున కనీస ధరకే కొనుగోలు చేసింది.

35
ట్రేడ్స్‌లో కూడా ముంబై మార్క్

ముంబై ఇండియన్స్ కేవలం వేలంలో మాత్రమే కాకుండా, వేలానికి ముందే పటిష్టమైన ట్రేడ్ వ్యూహాన్ని ఆచరించింది. ప్రధాన ఆటగాళ్లందరినీ ఇప్పటికే రిటైన్ చేసుకోవడంతో పాటు, శార్డుల్ ఠాకూర్, రూథర్ఫోర్డ్, మయాంక్ మార్కండేయ లాంటి కీలక ఆటగాళ్లను ట్రేడ్ చేసి తీసుకుంది. ఇదే ఆ ఫ్రాంచైజీని వేలంలో పెద్ద పనిలేకుండా చేసింది.

45
రిటైన్ వీరే

హార్దిక్ పాండ్యా రూ. 18 కోట్లు, రోహిత్ శర్మ రూ. 16.30 కోట్లు, జస్ప్రీత్ బుమ్రా రూ. 18 కోట్లు, సూర్యకుమార్ యాదవ్ రూ. 16.35 కోట్లు, తిలక్ వర్మ రూ. 8 కోట్లు, నమన్ ధీర్ రూ. 5.25 కోట్లు, ట్రెండ్ బౌల్ట్ రూ. 12.50 కోట్లు, రాన్ రిక్కెల్టన్ రూ. కోటి, దీపక్ చాహర్ రూ. 9.25 కోట్లు, విల్ జాక్స్ రూ. 5.25 కోట్లు, అశ్విని కుమార్ రూ. 30 లక్షలు, మిచెల్ శాంట్నార్ రూ. 2 కోట్లు, రాజ్ భవ రూ. 30 లక్షలు, రాబిన్ మింజ్ రూ. 65 లక్షలకు రిటైన్ చేసుకుంది.

55
కోర్ టీం బలం

ఈ పటిష్టమైన కోర్ టీమ్‌కు వేలంలో కీలక ప్లేయర్స్, ట్రేడ్‌ చేసిన ఆటగాళ్లు తోడైతే ముంబై ఇండియన్స్‌కు తిరుగలేదని చెప్పొచ్చు. ముంబై ఇండియన్స్ 2026 ఐపీఎల్ సీజన్‌కు కాగితంపై అత్యంత పటిష్టమైన జట్టుగా కనిపిస్తోంది. తక్కువ బడ్జెట్‌తో మంచి ఆటగాళ్లను ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories