సగం టోర్నీ ముగిసేసరికి ఐపీఎల్ 2026 మరింత రసవత్తరంగా మారింది… ప్లేఆఫ్స్ రేసు మొదలయ్యింది. మరి ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్న 10 జట్లకు ప్లేఆఫ్ అవకాశాలు ఎలా ఉన్నాయి..? ఎవరికి అవకాశాలు ఎక్కువ… ఎవరికి తక్కువగా ఉన్నాయి?
ఐపీఎల్ 2026 టోర్నీ కీలక దశకు చేరుకుంది… ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్ కీలకం కానుంది. ప్రతి గెలుపోటమితో సమీకరణాలు వేగంగా మారతాయి. మన సన్ రైజర్స్ హైదరాబాద్ సహా ఓ నాలుగు జట్లు ప్లేఆఫ్స్ కు చేరడం సులువుగా కనిపిస్తోంది. అయితే మిగతా జట్లకూ దారులు మూసుకుపోలేదు… కాస్త కష్టం మాత్రమే. అంటే ఇప్పటికీ అన్ని జట్లకూ ప్లేఆఫ్ అవకాశాలు ఉన్నాయన్నమాట.
25
ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు...
డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడిన ఆర్సిబి 6 గెలిచింది… 12 పాయింట్లు సాధించింది. ఈ టీంకు ఇంకా 6 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి... వీటిలో 2 గెలిస్తే చాలు, ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. కాబట్టి ఆర్‌సీబీకి ప్లేఆఫ్స్ దారి సులువుగా ఉంది.
35
ఆర్‌సీబీ సహా నాలుగు జట్లకు ఈజీ ఛాన్స్
ఆర్‌సీబీతో పాటు మరో మూడు జట్లకు ప్లేఆఫ్స్ చేరేందుకు మంచి అవకాశం ఉంది. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టుకు మిగిలిన 6 మ్యాచ్‌ల్లో 2 విజయాలు అవసరం. ఇది కేవలం ప్లేఆఫ్స్‌కు కనీస అర్హత కోసం మాత్రమే. టాప్ లో ఉండాలంటే ఇంకా ఎక్కువ విజయాలు కావాలి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కు కూడా ప్లేఆఫ్ కు చేరే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. 9 మ్యాచుల్లో 6 విజయాలు సాధించి12 పాయింట్లు సాధించింది… దీంతో పాయింట్స్ టేబుల్ లో మూడో స్థానంలో ఉంది.
ఇక ఆర్సిబి, రాజస్థాన్ రాయల్స్ కూడా 12 పాయింట్లు సాధించింది… నెట్ రన్ రేట్ ఆధారంగా సన్ రైజర్స్ మూడు, ఆర్ఆర్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈ జట్లకు కూడా కనీసం 2 విజయాలు అవసరం. అయితే హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం టేబుల్‌లో టాప్-4లో ఉన్న ఈ జట్లకు మరో రెండు విజయాలు ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేస్తాయి.
55
అన్ని జట్లకూ ఛాన్స్...
గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 6 మ్యాచ్‌ల్లో 4 గెలవాలి. గుజరాత్ ప్రస్తుత ఫామ్ చూస్తే ఇది కొంచెం కష్టమే. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన 6 మ్యాచ్‌ల్లో 5 గెలవాలి. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు నమోదు చేయాలి.
పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్న మూడు జట్లకు ఇది చివరి అవకాశం. కోల్‌కతా నైట్ రైడర్స్ మిగిలిన 6 మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. అలాగే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా తమ తర్వాతి 6 మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి. అయితేనే సెమీస్ కు చేరతాయి.