IPL 2026: ఈ ఐపీఎల్ వేలంలో భారతీయ ఆటగాళ్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొననుంది. దీపక్ హుడా, చేతన్ సకారియా, విగ్నేష్ పుత్తూర్, ఆకాష్ మధ్వాల్, కె.ఎస్. భరత్, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి లాంటి ప్లేయర్స్ ఈ లిస్టులో ఉన్నారు.
ప్రతి ఐపీఎల్ సీజన్ కంటే ఈసారి టీమ్స్ ఎక్కువ మంది భారతీయ ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. దీనివల్ల ఈ వేలంలో బడా ఇండియన్ ప్లేయర్స్ ఎవరూ లేరు. అందుబాటులో ఉన్న కొద్దిమంది నాణ్యమైన ఆటగాళ్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొననుంది. ఈ వేలంలో భారతీయ ఆటగాళ్లు ఎవరు, వారిని ఏ టీమ్స్ లక్ష్యంగా చేసుకోవచ్చు అనేది చూద్దాం.
25
దీపక్ హుడా, చేతన్ సకారియా..
ఒకరేమో బ్యాటింగ్ ఆల్ రౌండర్‌గా, ఇంకొకరు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌గా డొమెస్టిక్ క్రికెట్‌లో మంచి ప్రదర్శనలు కనబరిచారు. వీరిని గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కన్నేశాయి.
35
విగ్నేష్ పుత్తూర్, ఆకాష్ మద్వాల్..
ఈ ఇద్దరు ప్లేయర్స్ కోసం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్LSG, DC, KKR, SRH వంటి టీమ్స్ గురి పెట్టాయి. ఈ జట్లకు స్పిన్నర్, డెత్ బౌలర్లు అవసరం. అందుకే వీరిపై గట్టి పోటీ నెలకొంది. కాబట్టి ఇతని కోసం పోటీ పడతాయి.
ఈ ఇద్దరు ప్లేయర్స్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, RCB, LSG, GT, SRH వంటి టీమ్స్ టార్గెట్ చేస్తున్నాయి. మయాంక్ అగర్వాల్, కెఎస్ భరత్ ప్రస్తుతం జరుగుతోన్న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అదరగొడుతున్నారు. టీ20 ఫార్మాట్‌కు తగ్గట్టుగా పరుగులు రాబడుతున్నారు.
55
పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి
గత రెండు సంవత్సరాలుగా ఐపీఎల్‌లో పెద్దగా రాణించకపోయినా, పృథ్వీ షా ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నాడు. అతడి కోసం KKR, LSG, GT పోటీ పడవచ్చు. అలాగే రాహుల్ త్రిపాఠి కోసం LSG, KKR, రాజస్థాన్ రాయల్స్ ఆసక్తి చూపించవచ్చు. ఎందుకంటే మిడిలార్డర్‌లో రాహుల్ త్రిపాఠి దూకుడైన బ్యాటింగ్ చేస్తాడు. అటు వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్, రాహుల్ చాహర్, ఆకాష్ దీప్‌పై పోటీ నెలకొంది.