Esha Singh : హైదరబాదీ డ్రైవర్ కూతురికి ISSF ప్రపంచకప్‌లో గోల్డ్ మెడల్.. ఎవరీ ఈషా సింగ్?

Published : Jul 27, 2026, 09:07 PM IST

హైదరాబాద్‌కు చెందిన 21 ఏళ్ల ఈషా సింగ్ ఇంటర్నేషనల్ షూటింగ్ లో అద్భుతాలు చేస్తోంది. సాధారణ డ్రైవర్ కూతురు ISSF ప్రపంచకప్‌లో స్టార్ షూటర్ మను భాకర్‌ను ఓడించి స్వర్ణం గెలుచుకుంది.

PREV
15
మన హైదరాబాద్ అమ్మాయికి స్వర్ణం

మన తెలుగమ్మాయి ఈషా సింగ్ యావత్ దేశమే గర్వపడేలా చేసింది. హైదరాబాద్‌కు చెందిన 21 ఏళ్ల ఈ అమ్మాయి ISSF (ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్) ప్రపంచకప్ లో స్వర్ణం సాధించి దేశ ప్రజలందరి చూపు తనవైపు తిప్పుకుంది. ఇప్పుడు ఎవరీ ఈషా సింగ్? అని ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు.

ఓ డ్రైవర్ కుమార్తెగా, ఎన్నో ఆర్థిక ఇబ్బందులను దాటుకుని షూటింగ్‌లో అద్భుతాలు సృష్టిస్తోంది ఈ హైదరబాదీ అమ్మాయి. ఏషియన్ గేమ్స్‌లో సత్తా చాటి, ఇప్పుడు ఏకంగా స్టార్ షూటర్ మను భాకర్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ఈ 'గోల్డెన్ గర్ల్' విజయ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం.

25
ISSF ప్రపంచకప్‌లో ఇషా సింగ్ ఇరగదీసిందిగా..

గత కొన్నేళ్లుగా భారత షూటర్లు అద్భుత విజయాలు సాధిస్తున్న విషయం తెలిసింది. ఇలా ఇవాళ (జూలై 27, సోమవారం) జరిగిన ISSF ప్రపంచకప్‌లో భారత షూటర్లు రెండు పతకాలు గెలిచారు. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మన హైదరాబాద్ అమ్మాయి ఈషా సింగ్ అతి చిన్నవయసులోనే (21 ఏళ్లు) అద్భుత ప్రదర్శనతో బంగారు పతకం కైవసం చేసుకుంది.  ఒలింపిక్ స్టార్ షూటర్ మను భాకర్‌ను ఆమె వెనక్కి నెట్టింది. ఫైనల్ రౌండ్‌లో ఇషా 40 హిట్స్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది.

35
మూడో స్థానంలో మను భాకర్..!

చైనాలోని హాంగ్‌జౌ లో జరిగిన ISSF ప్రపంచకప్‌ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఈషా ఈ ఘనత సాధించింది. ఫైనల్ రౌండ్‌లో తీవ్ర ఒత్తిడిలోనూ 50కి 40 షాట్లను కచ్చితత్వంతో షూట్ చేసింది. చైనాకు చెందిన జాంగ్‌ను ఓడించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇదే పోటీలో భారత స్టార్ అథ్లెట్ మను భాకర్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

45
ఎవరీ ఈషా సింగ్?

ఈషా సింగ్ జనవరి 1, 2005న హైదరాబాద్‌లో జన్మించింది. ఆమె తండ్రి ఒక డ్రైవర్. చిన్నప్పటి నుంచి ఆమెకు షూటింగ్ అంటే ఇష్టం. మొదట్లో గో-కార్టింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడినప్పటికీ, 10 ఏళ్ల వయసులో షూటింగ్‌ను ఎంచుకుంది. ఇంట్లోనే ప్రాక్టీస్ చేసేందుకు ఆమె తండ్రి ఎంతో సాయం చేశారు. ఆ తర్వాత ఒలింపిక్ పతక విజేత గగన్ నారంగ్ అకాడమీలో ఆమె శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది.

55
ఏషియన్ గేమ్స్‌లో 4 పతకాలు

కోచ్ గగన్ నారంగ్ వద్ద శిక్షణ తర్వాత ఈషా సింగ్ ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణంతో సహా మొత్తం 4 పతకాలు గెలుచుకుంది. అంతేకాదు మ్యూనిచ్‌లో జరిగిన పోటీలో 43 పాయింట్లు సాధించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆమె విజయాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుతో సత్కరించింది. కేవలం 21 ఏళ్ల వయసులోనే ఆమె ఎన్నో అంతర్జాతీయ పతకాలు సాధించింది.

Read more Photos on
click me!

Recommended Stories