ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరగనుంది. అయితే ఈ మినీ ఆక్షన్‌కు ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్, SRH మాజీ బ్యాటర్ హ్యారీ బ్రూక్ దూరం కానున్నాడు. 2025 ఐపీఎల్ సీజన్‌కు ముందు అతను ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడమే ఇందుకు కారణం. బీసీసీఐ నిబంధనల ప్రకారం, వేలంలో రిజిస్టర్ చేసుకుని ఎంపికైన తర్వాత, సీజన్ ప్రారంభానికి ముందు అందుబాటులో లేకుండా పోయిన ఏ ఆటగాడినైనా రెండు సీజన్ల పాటు టోర్నమెంట్‌లో, వేలంలో పాల్గొనకుండా నిషేధం విధిస్తారు. అందుకే బ్రూక్‌పై బీసీసీఐ బ్యాన్ విధించింది.