తొలి ఐపీఎల్ లో తొలి సిక్సర్.. అర్జున్ టెండూల్కర్ ఆటకు ఫ్యాన్స్ ఫిదా..

Published : Apr 26, 2023, 09:35 AM IST

సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ క్రికెటర్ గా తన సత్తా చాటుకుంటున్నాడు. మంగళవారం జరిగిన మ్యాచ్ లో తొలి సిక్సర్ కొట్టి అలరించాడు. 

PREV
16
తొలి ఐపీఎల్ లో తొలి సిక్సర్.. అర్జున్ టెండూల్కర్ ఆటకు ఫ్యాన్స్ ఫిదా..

ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్లో.. అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాడు. ఐపీఎల్ లో తన తొలి సిక్సర్ బాదాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో అర్జున్ టెండూల్కర్ తొమ్మిదవ నెంబర్ ఆటగాడిగా క్రీజ్ లోకి వచ్చాడు. 

26

గుజరాత్ టైటాన్స్ నుంచి మోహిత్ శర్మ వేసిన బాల్ ని భారీ సిక్స్ కొట్టాడు. మోహిత్ షార్ట్ బాల్ వేశాడు. అర్జున్ టెండూల్కర్ డీప్ స్క్వేర్ దిశగా సిక్సర్ కొట్టాడు. ఇది హైలైట్ గా నిలిచింది.

36

ఇక్కడ మరో విశేషం ఏమిటంటే అర్జున్ టెండూల్కర్ కు ఇది తొలి ఐపిఎల్ సీజన్.. అంతేకాదు అర్జున్ కెరీర్ లో తొలి సిక్సర్ కూడా ఇదే. అర్జున్ టెండూల్కర్ బౌలర్గా మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇప్పుడు ఈ సిక్సర్ తో బ్యాటింగ్ లోను అలరించాడు. దీంతో  సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

46

అర్జున్ టెండూల్కర్ లో మంచి టాలెంట్ ఉందని బ్యాటింగ్లో ప్రమోషన్ ఇవ్వాలని కోరుతున్నారు. ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ కు పంపించాలని.. అప్పుడు ముంబైకి మంచి ప్రయోజనం ఉంటుందని కోరుతున్నారు. మంగళవారం ముగిసిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై గుజరాత్ టైటాన్స్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

56

గుజరాత్ టైటాన్స్ 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ముందు ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ముంబై ఇండియన్స్ 152 పరుగులు మాత్రమే చేయగలిగింది.  21 బంతుల్లో 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 33 పరుగులతో కెమెరాన్ గ్రీన్.. 23 పరుగులతో సూర్యకుమార్ ఆ తరువాత స్థానాల్లో ఉన్నారు.

66

గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు. మోహిత్ శర్మ, రషీద్ ఖాన్లు.. చేరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ ఆరు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. గిల్ 56, మిల్లర్ 46, అభినవ్ మనోహర్ 46 పరుగులు చేశారు.

click me!

Recommended Stories